For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Yash యష్ పుట్టిన రోజున ప్రిన్స్‌పాల్‌కు లెటర్.. ట్రెండ్ సెట్ చేసిన కేజీఎఫ్ హీరో అభిమాని

  |

  కన్నడ సినీ పరిశ్రమలో టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ ప్రారంభించిన యష్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ఆయన జతకాన్నే కాకుండా కన్నడ సినిమా పరిశ్రమ ఫేట్‌ను మార్చేసింది. అండర్ డాగ్‌గా ఉన్న కన్నడ సినీ పరిశ్రమను యష్ మూవీ బాక్సాఫీస్‌కు అడ్డగా మార్చింది. ఇలాంటి ప్రతిష్టను కన్నడ పరిశ్రమకు అందించిన యష్ జనవరి 8వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ హీరో యష్ గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..

  బస్ డ్రైవర్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి

  బస్ డ్రైవర్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి

  కేజీఎఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. యష్ తండ్రి కర్ఠాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి నటుడి కావాలనే కోరికతో ఉన్న యష్ బెంగళూరు‌కు తన మకాం మార్చుకొన్నారు. చిన్న చిన్న పాత్రలతో కేజీఎఫ్ వరకు చేరుకొన్నారు.

  కేజీఎఫ్ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా

  కేజీఎఫ్ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా


  కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఓవర్‌నైట్‌లో స్టార్ హీరో అయ్యారు. బాలీవుడ్‌తోపాటు అన్ని సినీ పరిశ్రమలు ఆయన వైపు వెనక్కు తిరిగి చూశాయి. కేజీఎఫ్ తర్వాత దక్షిణాదిలో అత్యధిక పారితోషికంగా అందుకొనే హీరోల జాబితాలో యష్ చేరిపోయారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొన్నారు.

  యష్ అభిమాని లేఖ వైరల్‌గా

  యష్ అభిమాని లేఖ వైరల్‌గా

  కేజీఎఫ్ తర్వాత యష్‌కు అన్ని భాషల్లోను విశేషంగా అభిమానులు పెరిగిపోయారు. తాజాగా ఓ అభిమాని రాసిన లేఖ మీడియాలో వైరల్ అవుతున్నది. బళ్లారికి చెందిన ఓ కాలేజ్ స్టూడెంట్ కే శివ కుమార్ తన అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకను ఆన్‌లైన్‌లో జరుపుకోనేందుకు సెలవు ఇవ్వాలని ప్రిన్స్‌పాల్‌కు లేఖ రాశారు. కోవిడ్ కారణంగా ఆంక్షలు ఉండటంతో ఆన్‌లైన్‌తో తన ఫేవరేట్ హీరో బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు కాలేజ్ ఆంక్షలు అడ్డుగా మారాయి.

  నిజాయితీపై నెటిజన్ల ప్రశంసల వర్షం..

  నిజాయితీపై నెటిజన్ల ప్రశంసల వర్షం..

  శివకుమార్ చదివే కాలేజ్‌లో అటెండెన్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉండటంతో కాలేజ్‌ నుంచి బయటకు రావడం కష్టంగా మారడంతో ప్రిన్స్‌పాల్ అనుమతి కోరుతూ లేఖ రాశాడు. వేరే కారణాలు చెప్పకుండా నిజాయితీగా తన సమస్యను లేఖలో పొందుపరిచాడు. శివకుమార్ అభిమానాన్ని చూసి, లేఖలో ఆయన చెప్పిన విషయాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
  నా ఫ్రెండ్స్ ఆటపట్టించారు అంటూ..

  నా ఫ్రెండ్స్ ఆటపట్టించారు అంటూ..


  శివకుమార్ తన లేఖలో .. యష్ బాస్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొవడానికి సెలవు ఇవ్వండి. యష్ బ్రో బర్త్ డే రోజున ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేయాలని అనుకొంటున్నాం. అందులో నాతోపాటు నా స్నేహితులు కూడా పాల్గొంటారు. జనవరి 7 నుంచి 8వ తేదీన ప్రతీ రోజు 7 గంటలకు ట్రెండ్ చేయాలని నిర్ణయించాం. కాబట్టి నాకు మాత్రమే కాకుండా నా స్నేహితులకు ఒక రోజు సెలవు ఇవ్వండి అని శివకుమార్ లేఖ రాశారు. నేను లేఖ రాస్తానని అంటే నా ఫ్రెండ్స్ ఆటపట్టించారు. అయితే నా లెటర్‌ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ కావడం ఆశ్చర్యంగా ఉంది అని శివకుమార్ తెలిపారు.

  English summary
  KGF fame Yash alias Naveen Kumar Gowda celebrating his birthday with grand note. His fans also part of the celebrations. In this occassion, Bellary student K Shiva Kumar's letter goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X