twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటి సుమలత మీద మాజీ సీఎం దారుణ వ్యాఖ్యలు.. అడ్డంగా ప‌డుకోబెట్టి అంటూ!

    |

    ప్రముఖ నటి, ప్రస్తుత మాండ్య ఎంపీ సుమలత మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరంగా ఉన్న ఆ వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.. అసలు ఆయన ఏమన్నారు ? ఈ వివాదం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    డ్యాం వ్యవహారంలో

    డ్యాం వ్యవహారంలో

    ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలో కావేరి నది మీద కృష్ణ రాజ సాగర్ డ్యాం నుంచి నీరు లీకేజీ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ డ్యామ్ గురించి ఎంపీ సుమలత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

    ఎలాంటి పగుళ్ళు లేవు

    ఎలాంటి పగుళ్ళు లేవు

    కావేరి నదిపై నిర్మించిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్ కి పగుళ్ళు ఏర్పడ్డాయని సుమలత ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మధ్య జల వనరుల విభాగం నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు కూడా నిర్వహించింది.. ఈ తనిఖీల్లో ఎలాంటి పగుళ్లు లేవని ఇంజనీర్లు తేల్చిచెప్పారు..

    మీడియాతో మాట్లాడుతూ

    మీడియాతో మాట్లాడుతూ

    తాజాగా మైసూరు చక్కెర కర్మాగారం అంశంపై తమ పార్టీ ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రి ఎడ్యూరప్పను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ సుమలత మీద విరుచుకు పడ్డారు. ప్రాజెక్టు నుంచి నీరు లీక్ అవుతుందని ఆమె ఆరోపిస్తుంటే ప్రాజెక్టును ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

    సుమలతను అడ్డంగా పడుకోబెట్టాలి

    సుమలతను అడ్డంగా పడుకోబెట్టాలి

    ప్రాజెక్టు నుంచి లీకేజీ ఆపాలంటే సుమలతను అడ్డంగా పడుకోబెట్టాలని అంటూ నోరు జారడంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్ గౌడ మీద ఘన విజయం సాధించారు.. అప్పటినుంచి కుమారస్వామి సుమలత ను వీలుచిక్కినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు

    నోటిని అదుపులో ఉంచుకోవాలి

    నోటిని అదుపులో ఉంచుకోవాలి

    ఇక కుమారస్వామి తన మీద చేసిన వ్యాఖ్యల మీద సుమలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఎలాంటివారో తెలియాలంటే ఆయన కామెంట్ బట్టి అర్థం అయిపోతుంది అని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారన్న ఆమె విమర్శలు చేయడంలో తప్పులేదు కానీ, మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.

    Recommended Video

    Kalika Director Navarasan, Producer Natti Karuna Interview Part - 3
    వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు?

    వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు?

    ప్రాజెక్టు సమీపంలో అక్రమ మైనింగ్ వల్ల ఈ పగుళ్లు సమస్య ఏర్పడుతోందని, లీకేజీ జరిగే చోట ఆయననే పడుకోబెడితే సరిపోతుందని సుమలత కౌంటర్ ఇచ్చారు. 'నేను ఎవరి పేరు ప్రస్తావించలేదని పేర్కొన్న ఆమె ఆయన ఎందుకు స్పందిస్తున్నారు ? దీన్ని ఎందుకు అంత వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. మండ్యలో అక్రమ మైనింగ్‌లో పాల్పడిన వారిలో ఎవరున్నారనేది బహిరంగ రహస్యమన్న ఆమె రిజర్వాయర్‌పై సమగ్ర దర్యాప్తు జరగనివ్వండి అని పేర్కొన్నారు.

    English summary
    Former Karnataka Chief Minister HD Kumaraswamy has entered into controversy after he made derogatory remarks against Mandya MP Sumalatha Ambareesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X