ఆ హీరోని తిట్టవద్దు, ఫ్యాన్స్‌కి హీరో సుదీప్ రిక్వస్ట్.. కాట్రవర్సీగా మారిన ఫిట్ నెస్ ఛాలెంజ్!

దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారిన ఫిట్ నెస్ ఛాలెంజ్ కర్ణాటకలో కాంట్రవర్సీగా మారింది. యువ హీరో యష్.. స్టార్ హీరో సుదీప్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఫిట్ నెస్ పై చైతన్యం పెంచేందుకు దేశవ్యాప్తంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సుదీప్ తన ఫిట్ నెస్ వీడియోని పోస్ట్ చేస్తూ యష్, శివరాజ్ కుమార్ వంటి హీరోలని ఛాలెంజ్ చేశాడు. సుదీప్ ఛాలెంజ్ ని స్వీకరించిన యంగ్ హీరో యష్ తాను కూడా వీడియోని పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సుదీప్ ని యష్ ఏకవచనంతో సంబోధించడం ఆయన అభిమానులకు నచ్చలేదు.

Hero Sudeep request his fans to stop trolling on yash

నీ కన్నా వయసులో పెద్దవారిని గౌరవించడం నేర్చుకో అంటూ యష్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో సుదీప్ తన అభిమానులని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. యాష్ తనని పిలిచిన మాటలో ప్రేమ, ఆప్యాయత కనిపించాయని, అభిమానులు సంయమనం పాటించాలని సుదీప్ తన ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X