Rachita Ram ఫస్ట్ నైట్ అందరూ ఏం చేస్తారు? నేను అదే చేశా.. వివాదంలో సూపర్ మచ్చి హీరోయిన్ రచితా రామ్.. బ్యాన్

దక్షిణాదిలో వర్థమాన తారగా రాణిస్తున్న రచిత రామ్ వివాదంలో కూరుకుపోయారు. ఫస్ట్ నైట్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె ఇరుకున పడ్డారు. హిందూ వివాహ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రచిత రామ్ బేషరుతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదానికి కారణం ఏమింటనే విషయంలోకి వెళితే..

డింపుల్ క్వీన్‌గా పాపులారిటీ

డింపుల్ క్వీన్‌గా పాపులారిటీ

రచిత రామ్ అసలు పేరు బిందియా రామ్. డింపుల్ క్వీన్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. తొలుత అరసి అనే సీరియల్ ద్వారా వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టంది. ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2013లో హీరో దర్శన్‌తో కలిసి బుల్‌బుల్ అనే చిత్రం నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్లు తన్నుకొచ్చాయి. దిల్ రంగీల, అంబరీష చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

శృంగార సన్నివేశాల్లో నటించడంపై

శృంగార సన్నివేశాల్లో నటించడంపై

టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకొంటున్న రచిత రామ్ ప్రస్తుతం లవ్ యూ రచ్చు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె శృంగార సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ సీన్ల నటించడంపై మీ అనుభవం ఏమిటి అని మీడియా అడిగిన ప్రశ్నకు రచిత ఘాటైన సమాధానం చెప్పింది. సున్నితమైన సీన్లలో నటించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేయడం మరింత వివాదంగా మారింది.

ఫస్ట్ నైట్ సీన్లలో ఎలా నటించారని

ఫస్ట్ నైట్ సీన్లలో ఎలా నటించారని

లవ్ యూ రచ్చు మూవీలో ఫస్ట్ నైట్ సంబంధించి శృంగార సన్నివేశాల్లో నటించడంపై మాట్లాడుతూ.. స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే ఆమెతో ఇంటిమేట్ సీన్లలో నటించాను. ఇక్కడ చాలా మందికి పెళ్లిళ్లు జరిగాయి. వారిని కించపరచడం నా ఉద్దేశం కాదు కానీ.. పెళ్లి తర్వాత దంపతులు ఏం చేస్తారు? వాళ్లేం చేస్తారో తెలుసు కదా? వాళ్లు ఫస్ట్ నైట్ రొమాన్స్ చేయడం తప్పనిసరి అని రచిత రామ్ అన్నారు. అయితే నేను ఆ సీన్లలో ఎందుకు నటించాననే విషయం సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. మీకు ఓ అబ్బాయి ఉన్నాడు కదా.. ఫస్ట్ నైట్ గురించి మీరే చెప్పాలి అని రచిత రామ్ ఘాటైన సమాధానం ఇచ్చారు.

రచిత రామ్‌ను బ్యాన్ చేయాలంటూ..

రచిత రామ్‌ను బ్యాన్ చేయాలంటూ..

రచిత రామ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపడంతో కన్నడ క్రాంతి దళ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను సినిమా పరిశ్రమ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. రచితపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ క్రాంతి దళ్ సూచించింది. అయితే భారతీయ సంస్కృతిని, రాష్ట్ర పరువు ప్రతిష్టలను కించపరిచే విధంగా రచితరాయ్ వ్యాఖ్యలు చేసిందని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రసిడెంట్ తేజస్వి నాగలింగస్వామి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Recommended Video

Ghani Teaser లో Ram Charan Mass | టాలీవుడ్ డిసెంబర్ రిలీజులు || Filmibeat Telugu
కల్యాణ్ దేవ్ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి

కల్యాణ్ దేవ్ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి

రచితా రామ్ ప్రస్తుతం టాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించబోతున్నది. అంతేకాకుండా దాదాపు 20 చిత్రాల్లో నటిస్తున్నార. 2022 వరకు ఆమె డేట్స్ కూడా ఖాళీ లేవనే విషయం వినిపిస్తున్నది. అలాంటి టాప్ హీరోయిన్ ప్రస్తుత వివాదం నుంచి ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X