twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్.. నవ్వుతూ వెళ్లి అలా పోలీసులకు చిక్కి..

    |

    దేశవ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వ్యక్తులపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కొరడా ఝలిపిస్తున్నది. కన్నడ సినిమా పరిశ్రమలో కొద్ది రోజులుగా సినీ తారల ఇళ్లపై దాడులు, పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేదిని శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే...

     డ్రగ్ మాఫియాతో సంబంధాల ఆరోపణలపై

    డ్రగ్ మాఫియాతో సంబంధాల ఆరోపణలపై

    డ్రగ్స్ మాఫియాతో సంబంధాల ఆరోపణల రావడంతో విచారణకు హాజరుకావాలని హీరోయిన్ రాగిణికి సీసీబీ సెప్టెంబర్ 3వ తేదీన సమన్లు జారీ చేసింది. అయితే తాను బిజీగా ఉండటం వల్ల తన తరఫున లాయర్ విచారణకు హాజరవుతారు. తాను సోమవారం రోజున పోలీసుల ముందుకు వస్తానని వివరణ ఇచ్చింది.

    రాగిణి ద్వివేది ఇంటిపై మెరుపుదాడులు

    రాగిణి ద్వివేది ఇంటిపై మెరుపుదాడులు

    అయితే డ్రగ్స్ కేసులో దూకుడు ప్రదర్శిస్తున్న క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం ఉదయమే బెంగళూరులోని యెలహంకాలోని రాగిణి ద్వివేది ఇంటిపై దాడులు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ చేసి ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆమె.. కారులో నవ్వుతూ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్తూ మీడియాకు ఫోజులిచ్చారు.

    సెప్టెంబర్ 4 రోజంతా ప్రశ్నించిన సీసీబీ

    సెప్టెంబర్ 4 రోజంతా ప్రశ్నించిన సీసీబీ

    అనంతరం బెంగళూరులోని సీసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి పలు గంటలపాటు రాగిణిని ప్రశ్నించారు. అనంతరం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేశారు. వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి అరెస్ట్‌ను ధృవీకరించారు. ఆ తర్వాత మూడు రోజులపాటు పోలీస్ కస్టడీలోకి తీసుకొంటున్నట్టు మీడియాకు సమాచారం అందించారు. నిబంధనలకు అనుగుణంగా ఆమెను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు జరిపించారు.

    Recommended Video

    TV Serial Actress Ragini About Her Husband || Filmibeat Telugu
     రాగిణి నివాసం నుంచి కొంత మెటీరియల్

    రాగిణి నివాసం నుంచి కొంత మెటీరియల్

    రాగిణి ద్వివేది నివాసంలో మెరుపుదాడి చేసిన సమయంలో ఆమె ఇంటి నుంచి కొంత మెటీరియల్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఆమె ఇంటిలో నిషేధిత డ్రగ్స్ కూడా లభించాయనే వార్తలు కన్నడ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో వీరేన్, రవి శంకర్, రాహుల్, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరెన్ ఖన్నా పలు పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

    English summary
    Heroine Ragini Dwivedi arrested in Drugs probe by CCB of Bangalore. He was produced before magistrate via video conference on September 4th and taken into police custody for three days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X