For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పవర్ స్టార్ పేరుతో సుమలత రాజకీయం... సపోర్ట్ ఇవ్వడం లేదంటూ స్టేట్మెంట్!

|

లోక్ సభ ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. సినీ స్టార్లు సైతం ఆయా పార్టీల తరుపున, అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు పలానా సినీ స్టార్ మద్దతు తనకే ఉందంటూ వారి అభిమానుల ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మాత్రం అనుమతి లేకుండా ఎన్నికల్లో తన పేరును వాడుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ స్టేట్మెంట్ చేశారు.

మాండ్య నుంచి సుమలత పోటీ

మాండ్య నుంచి సుమలత పోటీ

సినీ నటి సుమలత.. తన భర్త అంబరీష్ మరణం అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కర్నాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్తిగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, యంగ్ హీరో నిఖిల్ జెడి(ఎస్) తరుపున పోటీ చేస్తున్నారు.

కన్నడ పరిశ్రమ మద్దతు

కన్నడ పరిశ్రమ మద్దతు

సుమలతకు కెజిఎఫ్ స్టార్ యష్, దర్శన్ లాంటి హీరోలతో పాటు కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది మద్దతు ఇస్తున్నారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మద్దతు కూడా సుమలతకు ఉందని నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ప్రకటించిన నేపథ్యంలో పునీత్ రియాక్ట్ అయ్యారు.

తాను మద్దుతు ఇవ్వడం లేదన్న పునీత్ రాజ్ కుమార్

తాను మద్దుతు ఇవ్వడం లేదన్న పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్ కుమార్ విడుదల చేసిన ప్రెస్ నోట్లో...నన్ను ప్రజలు నటుడిగా మాత్రమే చూడాలి, నేను రాజకీయాలకు పూర్తిగా దూరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పునీత్ తన అభిమానులకు ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మీకు ఎవరు సరైన నాయకుడు అనిపిస్తారో, ఎవరు ఎన్నికైతే మీ భవిష్యత్, దేశ భవిష్యత్ బావుంటుందని భావిస్తున్నారో వారికే ఓటు వేయాలని సూచించారు. తాను ఏ పార్టీకి, అభ్యర్థికి ప్రచారం చేయడం లేదని తేల్చి చెప్పారు.

రెండు ఫ్యామిలీస్ తనకు సన్నిహితులే

రెండు ఫ్యామిలీస్ తనకు సన్నిహితులే

దేవె గౌడ, అంబరీష్ రెండు ఫ్యామిలీలు తన మంచి కోరే వారే అని పూనీత్ స్పష్టం చేశారు. వారికి తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు, సమాజానికి సేవ చేయడానికి దేవుడు వారికి మరింత బలం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన పేరును రాజకీయాల్లో, ఎన్నికల్లో వాడవద్దని రిక్వెస్ట్ చేశారు.

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఏమన్నారంటే..

నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఏమన్నారంటే..

అయితే పునీత్ ఈ ప్రకటన చేయడానికి ముందు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ... ‘పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజున నేను అతడికి ఫోన్ చేశాను. తనకు తానుగా... మనం సుమలతకు సపోర్ట్ ఇవ్వాలని తెలిపారు. తాను అక్క(సుమలత) తరుపున ప్రచారం చేస్తానని కూడా చెప్పారు' అని తెలిపారు.

రూల్ బ్రేక్ చేసిన శివ రాజ్ కుమార్ భార్య

రూల్ బ్రేక్ చేసిన శివ రాజ్ కుమార్ భార్య

కాగా.. రాజ్ కుమార్ ఫ్యామిలీ దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే శివ రాజ్ కుమార్ భార్య గీత మాత్రం ఈ రూల్ బ్రేక్ చేశారు. 2014లో ఆమె జెడి(ఎస్) తరుపున శివమొగ్గ లోక్ సభ స్థానానికి పోటీ చేశారు.

రాజ్ కుమార్ కోడలిగా పోటీ చేయలేదు

రాజ్ కుమార్ కోడలిగా పోటీ చేయలేదు

గీత పోటీ చేయడంపై అప్పట్లో రాజ్ కుమార్ ఫ్యామిలీ స్పందిస్తూ... ఆమె డాక్టర్ రాజ్ కుమార్ కోడలిగా పోటీ చేయడం లేదని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కూతురుగా పోటీ చేశారని ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల్లో గీత.... అప్పటి బీజేపీ చీఫ్ బిఎస్ యడ్యూరప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.

English summary
Kannada powe star Puneeth Rajkumar said that, he would like to be recognised by people as an artist and not as a politician, but he urges his fans to vote, sensibly. "It is the duty of the people to exercise their constitutional right to vote and it is the individual's choice to choose their candidates. As the citizen of this country, I respect their decision and will convey my fans to be responsible voters, but I do not endorse any candidate or party.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more