డ్రగ్స్ కేసు: టెస్టుల కోసం మూత్రం అడిగితే, వైద్యులకే షాక్ ఇచ్చిన హీరోయిన్.. ఆ సీసాలో ఏం పోసిందంటే?

దేశవ్యాప్తంగా మరోసారి డ్రగ్స్ వివాదం సినీ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. హీరోయిన్స్ పేర్లు ఈ సారి ఎక్కువగా బయటపడడం మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే కన్నడ పరిశ్రమలో కూడా సంజనా గల్రాని, రాగిణి ద్వివేది పేర్లు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మొదటి రోజే ఏడుపులు..

మొదటి రోజే ఏడుపులు..

డ్రగ్స్ వినియోగం, సరఫరా వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజనా, రాగిణి ప్రస్తుతం మడివాళ మహిళా సంరక్షణ పునర్వసతి కేంద్రంలో పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే జైలు వాతావరణం వారిద్దరిని మనోవేదనకు గురి చేస్తోందట. మొదటిరోజే సంజనా వెక్కి వెక్కి ఎడ్చేసినట్లు తెలిసింది.

హీరోయిన్స్ మధ్య గొడవలు

హీరోయిన్స్ మధ్య గొడవలు

ఇక డ్రగ్స్ కేసులో మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించడానికి అలాగే వారి ఆస్తుల లెక్కలను తేల్చడనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సరికొత్తగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో హీరోయిన్స్ మధ్య గొడవలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సంజనా, రాగిణి మంచి స్నేహితులు. ఇక ఇద్దరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో దానికి కారణం నువ్వంటే..నువ్వే అని నిందలు వేసుకుంటున్నారట.

మూత్రానికి బదులు నీళ్లు పోసి..

మూత్రానికి బదులు నీళ్లు పోసి..

సంజనా వ్యవహారం ఒకలాగా ఉంటే మరోవైపు రాగిణి వ్యవహరిస్తున్న తీరు మరోలా ఉంది. శనివారం ఆరోగ్యపరమైన టెస్టులు కోసం వైద్యులు రాగిణికి సంప్రదించగా ఊహించని షాక్ ఇచ్చింది. మూత్ర పరీక్షల కోసం రాగిణికి ఒక చిన్న సీసా ఇవ్వగా.. అందులో ఆమె మూత్రానికి బదులు నీళ్లు పోసి ఇచ్చింది. ఈ విషయం వైద్యులను విస్మయానికి గురి చేసింది.

రాగిణిపై అధికారుల ఆగ్రహం

రాగిణిపై అధికారుల ఆగ్రహం

రాగిణి చేసిన పనికి వైద్యులతో పాటు అధికారులు కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రాగిణి ఏమి మాట్లాడలేదు. చివరకు ఒక మహిళ పోలీసు చేత ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు హెల్త్ రిపోర్ట్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput కేసు విచారణ పై లేడి అమితాబ్ Vijaya Shanthi పోస్ట్ || Oneindia Telugu
షాక్ ఇస్తున్న ఆస్తుల లెక్కలు

షాక్ ఇస్తున్న ఆస్తుల లెక్కలు

సంజనా, రాగిణి ఆస్తుల లెక్కలు ప్రస్తుతం అధికారులకు షాక్ ఇస్తున్నాయి. ఈడీ అధికారులు ఇప్పటికే హీరోయిన్స్ పై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. బినామీ పేర్లతో వీరి దగ్గర ఆస్తులు చాలానే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అడ్డగోలుగా ఆదాయాలు కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసు విచారణలో మరిన్ని షాకిచ్చే సీక్రెట్స్ బయటకు రానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X