twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ అవార్డుల్లో ఘోర తప్పిదం: డొల్లు విషయంలో పప్పులో కాలేసిన జ్యూరీ, అవార్డు ఎందుకిచ్చారో: దర్శకుడు

    |

    68వ జాతీయ అవార్డుల ప్రకటన దేశవ్యాప్తంగా సినిమా రంగంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అవార్డుల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మెజారిటీ అవార్డులను దక్షిణాది సినిమా పరిశ్రమ దక్కించుకోవడం హర్షం వ్యక్తమవుతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ ఘోర తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డోల్లు సినిమాకు ఇచ్చిన అవార్డును సైతం చిత్ర యూనిట్‌కు స్వీకరించడంపై మల్లగుల్లాలు పడుతున్నది. డొల్లు సినిమాకు ఇచ్చిన అవార్డు తప్పిదంపై ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకొట్టి చేసిన ట్వీట్‌పై దర్శకుడు సాగర్ పురానిక్ స్పందిస్తూ..

     వివాదానికి కేంద్రంగా డొల్లు మూవీ

    వివాదానికి కేంద్రంగా డొల్లు మూవీ

    కన్నడ చిత్రం డొల్లు సినిమాకు సాగర్ పురాణిక్ దర్శకత్వం వహించారు. అపేక్ష పురోహిత్, పవన్ వడేయార్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి హెగ్డే, బాబు హిరన్నయ్య, కార్తీక్ మహేష్ తదితరులు నటించారు. అయితే సినిమాకు సింక్ సౌండ్ రికార్డింగ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. అయితే ఈ సినిమాలో సింక్ సౌండ్ రికార్డు వాడకపోవడం వివాదంగా మారింది.

    సింక్ సౌండ్ రికార్డింగ్ కాదు.. రసూల్ పూకూట్టి

    సింక్ సౌండ్ రికార్డింగ్ కాదు.. రసూల్ పూకూట్టి


    డొల్లు సినిమాకు సింక్ సౌండ్ రికార్డింగ్ కేటగిరిలో అవార్డు ప్రకటించడంపై ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకూట్టి స్పందించారు. ఏ సినిమాకైతే సింక్ సౌండ్ రికార్డింగ్ కేటగిరిలో జాతీయ అవార్డు ప్రకటించారో.. ఆ సినిమా సింక్ సౌండ్ సినిమా కాదు. ఆ సినిమా డబ్బింగ్ సినిమా. ఈ విషయంపై సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ వివరణ ఇవ్వాలి అని రసూల్ పూకొట్టి ట్వీట్ చేశారు.

    మేము దరఖాస్తు చేసుకోలేదు అంటూ

    మేము దరఖాస్తు చేసుకోలేదు అంటూ


    డొల్లు సినిమాకు అవార్డు వ్యవహారంపై దర్శకుడు సాగర్ పురాణిక్ స్పందిస్తూ.. రసూల్ పూకూట్టి సాధించిన విజయాలపై నాకు గర్వంగా ఉంది. అందుకు నేను థ్యాంక్యూ చెప్పుకొంటున్నాను. సింక్ సౌండ్ వివాదం గురించి వివరణ ఇవ్వాలనుకొంటన్నాను. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్నప్పుడు అప్లికేషన్‌ సింక్ సౌండ్ అనే విషయాన్ని ధ‌ృవీకరించలేదు అని సాగర్ పురాణిక్ స్పష్టం చేశారు.

    సింక్ సౌండ్ ఉపయోగించలేదు

    సింక్ సౌండ్ ఉపయోగించలేదు


    జాతీయ అవార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నప్పుడు మేము ఆడియోగ్రఫి, లోకేషన్‌కు వెళ్లి సౌండ్ రికార్డు చేశామని చెప్పాం. మేము ఎక్కడా సింక్ సౌండ్ అనే పదం ఉపయోగించలేదు. సింక్ సౌండ్ కేటగిరిలో అవార్డు ఎందుకు ఇచ్చారో అనే విషయంపై మాకు స్పష్టత లేదు. ఆ పర్టిక్యూలర్ కేటగిరిలో బహుశా డొల్లు అనే కర్ఠాటక డ్రమ్స్ వాయిద్యం రికార్డింగ్ చేసినందుకు ఇచ్చి ఉంటారేమో ని భావిస్తున్నాం అని దర్శకుడు సాగర్ పురాణిక్ చెప్పారు.

    జ్యూరీ అందుకే ఇచ్చి ఉంటారేమో.. అని

    జ్యూరీ అందుకే ఇచ్చి ఉంటారేమో.. అని


    డొల్లు మూవీలో రెండు మూడు సార్లు ఈ వాయిద్యానికి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఉంటాయి. ఈ సౌండ్‌ను థియేటర్‌లో రికార్డు చేయలేదు. ఈ డొల్లు వాయిద్యానికి సంబంధించిన సౌండ్‌ను క్రియేట్ చేయడానికి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. అక్కడే డొల్లు పెర్ఫార్మర్స్ ప్రత్యేకంగా డ్రమ్స్‌ వాయించడం ద్వారా సౌండ్ రికార్డ్ చేశాం. అందుకే సింక్ సౌండ్ కేటగిరిలో జ్యూరీ అవార్డు ఇచ్చి ఉంటారేమో. కానీ మేము అప్లికేషన్‌లో ఎక్కడా సింక్ సౌండ్ అని చెప్పలేం అని సాగర్ పురాణిక్ చెప్పారు.

    English summary
    Kannada Movie Dollu gets award in Sinc Sound Recording category. But This movie is not sinc Sound. This fault finds by Resul Pookutty. Amid Contraversy, director Sagarik Puranik given clarity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X