For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ragini Dwivedi, Sanjjanaa Galrani Drugs Case: హైదరాబాద్‌లో బండారం బట్టబయలు.. చరిత్రలోనే తొలిసారి!

  |

  కన్నడ సినీ పరిశ్రమే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను అతలాకుతలం చేసిన బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అంతా సద్దుమణిగిందనుకొన్న ఈ కేసును బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తిరగదోడారు. దాంతో మరోసారి కన్నడ సినీ పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడు ఏ సినీ తార మెడకు ఈ డ్రగ్స్ కేసు చుట్టుకొంటుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసును మళ్లీ తిరగదోడటంతో కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదికి కష్టకాలం పొంచి ఉందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కన్నడ డ్రగ్స్ రాకెట్ కేసు వివరాల్లోకి వెళితే..

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  బెంగళూరులోని విలాసవంతమైన ప్రదేశాల్లో

  బెంగళూరులోని విలాసవంతమైన ప్రదేశాల్లో

  కరోనావైరస్ బెంగళూరులో కార్యకలాపాలను స్తంభింప చేసిన లాక్‌డౌన్ కాలంలో పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో వారికి విలాసవంతమైన కాలనీలో ఓ ట్రక్ లభ్యమైంది. అయితే అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ ట్రక్‌ను సోదా చేయడంతో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత ఆ తీగను గట్టిగా లాగడంతో కన్నడ సినీ పరిశ్రమలోని డగ్స్ డొంక బయటపడింది.

  Nabha Natesh చీరకట్టులో పరువాలు పంచిన ఇస్మార్ట్ బ్యూటీ

  సంజన, రాగిణి అరెస్ట్‌తో డొంక కదిలి

  సంజన, రాగిణి అరెస్ట్‌తో డొంక కదిలి

  అయితే బెంగళూరు క్రైమ్ బ్రాంచీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించడంతో సంజన గల్రానీ, రాగిణి ద్వివేది, డ్రగ్ పార్టీ ఆర్గనైజర్ వీరేన్ ఖాన్నా, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఇంకా 20 మందికిపైగా సెలబ్రీటలకు డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.

  చాలా రోజులు రిమాండ్‌లో ఉన్న సంజన గల్రానీ, రాగిణి, ఇంకా కొంత మందికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసు విచారణ స్తబ్దంగా ఉందని అనుకొనే సమయంలో పోలీసులు మరోసారి పంజా విసిరారు.

  మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..

  పది నెలలపాటు విస్తృత దర్యాప్తు

  పది నెలలపాటు విస్తృత దర్యాప్తు

  బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసులో పది నెలలు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అనంతరం సంజన గల్రానీ, రాగిణి ద్వివేది డ్రగ్స్ వినియోగించారనే విషయం తాజా పరీక్షల్లో తేలింది. తాజా విడుదలైన ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లో వారిద్దరూ నిషేధిత మాదక ద్రవ్యాలు సేవించినట్టు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.

  తొలిసారి వెంట్రుకల ద్వారా నిర్ధారణ

  తొలిసారి వెంట్రుకల ద్వారా నిర్ధారణ

  తాజాగా వైద్య నివేదికలపై అధికారులు స్పందిస్తూ.. మూత్ర, రక్త పరీక్షలనే కాకుండా డ్రగ్స్ వినియోగ నిర్దారణ పరీక్షల కోసం వెంట్రుకల శాంపిల్స్ తీసుకొన్నాం. వాటిని 2020 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికీ పంపించాం. డ్రగ్స్ కేసును వెంట్రుకల ద్వారా దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి. ఒకసారి డ్రగ్స్ తీసుకొంటే ఏడాది కాలం పాటు వెంట్రుకల్లో వాటి కణాలు నిక్షిప్తమై ఉంటాయి అని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

  నిజాయితీగా, వేగంగా దర్యాప్తు

  నిజాయితీగా, వేగంగా దర్యాప్తు

  డ్రగ్స్ కేసు దర్యాప్తు గురించి బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసును నిజాయితీగా, వేగంగా దర్యాప్తును పూర్తి చేయడం గర్వంగా ఉంది. గత సెప్టెంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేశాం. కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేశాం. తాజా రిపోర్టుల్లో కొంత మంది డ్రగ్స్ వినియోగించినట్టు స్పష్టమైంది. ఇప్పడే ఈ కేసు గురించి పూర్తి సమాచారం వెల్లడించడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టుల్లో కొందరు డ్రగ్స్‌ను వినియోగించారనే విషయం వెల్లడైంది. మెడికల్ రిపోర్టుల ద్వారా వారిపై చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తాం అని కమల్ పంత్ పేర్కొన్నారు.

  Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట
  సెలబ్రిటీలకు లీకులు.. అధికారుల సస్సెండ్

  సెలబ్రిటీలకు లీకులు.. అధికారుల సస్సెండ్

  డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో కొందరు సెలబ్రిటీల నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం గురించి స్పష్టమైన ఆధారాలు లభించాయి. డ్రగ్స్ కేసు దర్యాప్తు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రిపోర్టులను సేకరించాం. ఈ కేసులో కొందరు ఆఫ్రికా దేశస్థులను అరెస్ట్ చేశాం. సెలబ్రిటీలకు కేసు దర్యాప్తు సమాచారాన్ని లీక్ చేసిన అధికారులను సస్పెండ్ చేశాం. ఇది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సాధించిన ఘనవిజయం అంటూ కమల్ పంత్ పేర్కొన్నారు. దీంతో మరోసారి సంజన, రాగిణి మెడకు ఈ కేసు బలంగా చుట్టుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  English summary
  Kannada Stars Ragini Dwivedi and Sanjjana Galrani once again into deep troubles. Hyderabad's FSL tests confirmed that actors Ragini Dwivedi and Sanjjana Galrani consumed drugs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X