Toxic: యష్ మూవీలో నలుగురు హాట్ హీరోయిన్లు.. టాక్సిక్‌లో టాప్ కుర్ర భామలు ఎవరంటే?

కేజీఎఫ్ సినిమా తర్వాత యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో కనివినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన బోలెడన్నీ, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు లైయర్స్ డైస్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన గీతూ మోహన్ దాస్ అనే దర్శకురాలు రూపొందిస్తున్నారు. నిర్మాత కేవీఎన్, యష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ మాఫియా నేపథ్యంగా గోవా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న టాక్సిస్ సినిమాలో ఇండియన్ యాక్టర్లు మాత్రమే కాకుండా బ్రిటీష్ యాక్టర్లు డారెల్ డీ సిల్వా, బెనెడిక్ట్ గ్యారెట్ లాంటి నటులు నటిస్తున్నారు. అలాగే టొవినో థామస్, సుదేవ్ నాయర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Is Nayanathara Kiara Advani Tara Sutaria Huma Qureshi to Join Yash for Toxic Movie

గత కొద్ది నెలలుగా టాక్సిక్ సినిమా షూటింగు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతున్నది. ఇటీవల ముంబై, గోవాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ షూటింగును పూర్తి చేసుకొన్నారు. తదుపరి షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే తదుపరి షెడ్యూల్‌లో భారీ తారాగణంపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్టు సమాచారం.

టాక్సిక్ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ప్రకారం..త్వరలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ నలుగురు యంగ్ అండ్ హాట్ హీరోయిన్లు ఒక్కసారిగా సెట్‌లో వాలిపోతే ఎలా ఉంటుందో.. తెరపైన కనిపిస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Is Nayanathara Kiara Advani Tara Sutaria Huma Qureshi to Join Yash for Toxic Movie

యష్ హీరోగా నటించే ఈ సినిమాలో నయనతార ఆయనకు సోదరిగా నటిస్తున్నారు. యష్ జంటగా హీరోయిన్‌గా కియారా అద్వానీ కనిపించబోతున్నారు. ఇక హ్యుమా ఖురేషి విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే తారా సుతారియా పాత్రను చాలా సీక్రెట్‌గా చిత్ర యూనిట్ ఉంచుతున్నారని పింక్ విల్లా వెబ్ సైట్ ఓ కథనంలో పేర్కొన్నది.

ఇదిలా ఉండగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న షూటింగ్ చూస్తే.. ఈ సినిమా ప్లాన్ ప్రకారం విడుదల కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫిషియల్‌గా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

More from Filmibeat

Read more about: toxic yash nayanathara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X