స్టార్ ప్రొడ్యూసర్‌తో స్టార్ హీరోయిన్ సహజీవనం!

సినీ పరిశ్రమలో హీరోయిన్లకు నిర్మాతలు, దర్శకులకు, హీరోలకు అఫైర్లు ఉండటం.. డేటింగ్ చేయడం సర్వసాధారణంగా వినిపించే విషయాలు. అయితే కన్నడ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల ప్రేమాయణం ఓ హత్యకు దారి తీసిన నేపథ్యంలో మరో ప్రేమ కథ బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రముఖ నిర్మాతతో సీనియర్ హీరోయిన్ సహజీవనం చేస్తున్నదనే వార్తలకు బలం చేకూరేలా వారిద్దరూ కలిసి కనిపించడం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఆ ఇద్దరి ప్రేమాయణం వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడ కేసు తర్వాత కార్తీక్ గౌడ, రమ్య అఫైర్ గురించి ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. గత కొద్దికాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు అనే విషయం కొద్దికాలంగా మీడియాలో వినిపిస్తూ వస్తున్నది. కానీ వారిద్దరూ ఏ మాత్రం స్పందించలేదు.

Is Ramya live in Relationship with Karthik Gowda

కానీ ఇటీవల కార్తీక్ గౌడ, రమ్య ఇద్దరు కలిసి మెలిసి ఉండటం, అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొంటున్నారు. సోషల్ మీడియాలో వారిద్దరి గురించి ఇటీవల కొన్ని పోస్టుల కూడా వైరల్ అయ్యాయి. దాంతో ఈ విషయంపై మరింత చర్చ జరుగుతున్నది. అయితే ఈ విషయంపై వారిద్దరి పెదవి విప్పితే తప్పా అసలు విషయం బయటకు రాదనే అభిప్రాయం అందరిలోను ఉంది.

ఇక కార్తీక్ గౌడ విషయానికి వస్తే..కన్నడ సినిమా పరిశ్రమలో బడా నిర్మాత. అలాగే కేఆర్‌జీ స్టూడియోస్ అధినేత. 2017లో స్టూడియో నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 100 సినిమాలను డిస్టిబ్యూట్ చేశారు. అలాగే రత్నన్ ప్రపంచ అనే మూవీతో కన్నడలోకి ప్రవేశించి సినిమా నిర్మాణంలోను బిజీగా ఉన్నారు.

ఇక రమ్య విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు దివ్య స్పందన. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్నారు. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు అంటిముట్టనట్టు ఉంటున్న ఆమె సినిమాలపై ఫోకస్ పెట్టారు.

కార్తీక్ గౌడ్ నిర్మిస్తున్న ఉత్తరాకాండ చిత్రంలో రమ్య కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ శివరాజ్ కుమార్, ధనంజయ, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: ramya karthik gowda sandalwood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X