Yash యష్ 150 కోట్ల రెమ్యురేషన్ డిమాండ్ చేశాడా? ఏ సినిమాకో తెలుసా?

కన్నడ సినిమా రంగానికి పరిమితమైన యష్ మీడియం రేంజ్ హీరోగానే అందరికి తెలుసు. కానీ కేజీఎఫ్ సినిమా తర్వాత యష్ అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకులందరి నుంచి భారీ పాపులారిటీ అందుకొన్నారు. కేజీఎఫ్ హిట్ తర్వాత ఆయన ఇమేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అలాంటి అంచనాల మధ్య కేజీఎఫ్ 2 రావడంతో ఆ పాపులారిటీ మరింత పెరిగింది. అయితే తాజాగా ఓ రామాయణం సినిమా కోసం ఎవరూ ఊహించని రెమ్యునరేషన్‌ను అడిగినట్టు సమాచారం. యష్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

కేజీఎఫ్ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టడంతో యష్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టారు. అయితే కేజీఎఫ్ 2 సినిమా తర్వాత మంచి కథలు, పాత్రల కోసం దాదాపు ఏడాదికిపైగానే వేచి చూశారు.

Is Yash demands 150 Crores Remuneration for Ranbir Kapoor and Sai Pallavi s Ramayan

కేజీఎఫ్ సినిమా రిలీజ్ తర్వాత మూడేళ్లకు ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకుడు. డ్రగ్ మాఫియా నేపథ్యంతో సాగే ఈ సినిమాను శ్రీలంక, లండన్, గోవాలో చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఈ సినిమాను ప్రకటించిన వెంటనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా, యష్‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణం సినిమాలో కీలక పాత్రలో నటించమని ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రను యష్‌కు ఆఫర్ చేయగా.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Is Yash demands 150 Crores Remuneration for Ranbir Kapoor and Sai Pallavi s Ramayan

మీడియాలో ప్రచారం అవుతున్న ప్రకారం రావణుడి పాత్ర కోసం యష్ సుమారుగా 150 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ రేంజ్ పారితోషికాన్ని ఇచ్చి ఆయనతో రావణుడి పాత్రను చేయిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ నిజంగా ఇస్తే ప్రభాస్ తర్వాత ఆయనే టాప్ హీరోగా నిలుస్తాడు.

ఇక దేశంలో 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొనే హీరోల్లో ప్రభాస్ ఒకరు. హిందీలో షారుక్ ఖాన్ ఈ రేంజ్ కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకొంటారనే టాక్. ఎందుకంటే.. సొంత నిర్మాణ సంస్థలోను, ఇతర బ్యానర్లలో బిజినెస్‌లో వాటా తీసుకొంటారనేది అందరికి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X