కేజీఎఫ్ హీరో యష్ ఇంటిపై ఐటీదాడులు.. పలువురు హీరోల పన్ను ఎగవేతపై ఆరా!

Recommended Video

KGF Movie Hero Yash & Others Faces IT Raids | Filmibeat Telugu

పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే కారణంతో కన్నడ సినీ నటుల నివాసాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడుల నిర్వహించారు. ప్రముఖ సినీ నటుల ఇళ్లపై మూకుమ్మడిగా దాడులు జరపడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేజీఎఫ్‌తో భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ రాకింగ్ స్టార్ యష్, పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ తదితరుల నివాసాలపై దాడులు నిర్వహించినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

సినీ తారల ఇంటిపై ఆకస్మిక దాడులు

సినీ తారల ఇంటిపై ఆకస్మిక దాడులు

జనవరి 3, గురువారం ఉదయం తెల్లవారుజామున్నే కన్నడ సినీతారల ఇళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో పలు డాక్యుమెంట్లు, లెక్క తేలని నగదు లభ్యమైనట్టు సమాచారం. కడపటి వార్తలు అందేసరికి ఇంకా సినీ ప్రముఖుల ఇళ్లపై దాడుల కొనసాగుతున్నట్టు తెలిసింది.

 గురువారం తెల్లవారుజామున

గురువారం తెల్లవారుజామున

గురువారం తెల్లవారు జామున బెంగళూరులోని సదాశివ నగర్‌లోని పునీత్ రాజ్‌కుమార్, నగాపుర హౌస్‌లోని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, నగరబావిలోని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరంగదుర్ నివాసంలో దాడులు నిర్వహించారు అని మీడియా కథనాలు వెలువడ్డాయి. నిర్మాత సీఆర్ మనోహర్, ప్రముఖ డిస్టిబ్యూటర్ జయన్న నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

కేజీఎఫ్ వసూళ్ల సునామీ

కేజీఎఫ్ వసూళ్ల సునామీ

రాక్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 వసూళ్లను రాబట్టింది. కేవలం కన్నడ రంగంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. ఇంకా ఈ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది.

 బాహుబలి తర్వాత కేజీఎఫ్ మూవీ

బాహుబలి తర్వాత కేజీఎఫ్ మూవీ

క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం డిసెంబర్ 21న రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించిన చిత్రంగా కేజీఎఫ్ సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X