twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీతారలపై ఐటీ దాడులు.. కుప్పలుగా బంగారం, నల్లధనం.. మొత్తం ఎన్ని కోట్లంటే..

    |

    Recommended Video

    Sandalwood IT Raids : Kannada Actors & Producers Have Rs109 Crore Of Unaccounted Income | Filmibeat

    కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఆదాయపు పన్ను అధికారులు దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఈ దాడుల వెనుక ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత గురువారం కన్నడ సూపర్ స్టార్లు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్, యష్, సుదీప్ కిచ్చ, నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేష్, జయన్న, సీఆర్ మనోహన్ తదితరులపై దాడులు నిర్వర్తించారు. వివరాల్లోకి వెళితే..

    మూడు రోజులపాటు నిరవధికంగా

    మూడు రోజులపాటు నిరవధికంగా

    కర్ణాటక రాష్టవ్యాప్తంగా ప్రధానంగా బెంగళూరు, గోవా పరిసర ప్రాంతాల్లో మూడు రోజులపాటు నిరవధికంగా ఐటీ దాడులు జరిగాయి. మొత్తం 5 ప్రాంతాల్లోని 21 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాం. ఈ దాడుల్లో సుమారు 180 మంది అధికారులు పాల్గొన్నారు. గత మూడు నెలలుగా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా దాడులు నిర్వహించాం అని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    రూ.109 కోట్ల మేర నల్లధనం

    రూ.109 కోట్ల మేర నల్లధనం

    పలు డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను భారీగా సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో సినీ ప్రముఖుల వద్ద నుంచి రూ.109 కోట్ల మేర నల్లధనాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో లెక్క తేలని డబ్బు లభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఈ దాడులు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు.

    కేజీఎఫ్ హీరో యష్ ఇంటిపై ఐటీదాడులు.. పలువురు హీరోల పన్ను ఎగవేతపై ఆరా!కేజీఎఫ్ హీరో యష్ ఇంటిపై ఐటీదాడులు.. పలువురు హీరోల పన్ను ఎగవేతపై ఆరా!

    లెక్క తేలని నగదు, ఆభరణాలు, ఆస్తులు

    లెక్క తేలని నగదు, ఆభరణాలు, ఆస్తులు

    ఐటీ అధికారులు వెల్లడించిన ప్రకారం.. దాడుల్లో లెక్క తేలని రూ.11 కోట్ల మేర ఆస్తులు, రూ.2.85 కోట్లు నగదు ఉంది. 25.3 కోట్ల బంగారు ఆభరణాలతోపాటు మొత్తం రూ.109 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా కొందరు ప్రముఖులు ఆదాయానికి మించి ఆస్తులు కూడా ఉండటాన్ని కూడా అంగీకరించినట్టు తెలుస్తున్నది.

    కేంద్ర రాజకీయ ప్రోద్భలంతోనే

    కేంద్ర రాజకీయ ప్రోద్భలంతోనే

    ఐటీ దాడుల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు భగ్గుమంటున్నారు. ఈ దాడుల వెనుక కారణం తెలుసు. రాజకీయ ప్రోద్భలంతోనే ఈ సోదాలు జరిగాయి. గత మూడు నెలలుగా రెక్కీ నిర్వహించి ఈ దాడులకు పాల్పడ్డారు అని ప్రశాంత్ సంబార్గి తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ దాడుల తర్వాత ఆదాయపు పన్నుశాఖ ఓ ప్రకటనను జారీ చేసింది.

    English summary
    Some Kannada actors and producers have admitted to keeping Rs 109 crore of unaccounted income during the raids conducted by Income Tax (IT) Department. Kannada actors Puneeth Rajkumar, Shiva Rajkumar, Yash and Sudeep and producers Rockline Venkatesh, Jayanna and CR Manohar had woken up to the raids by income tax sleuths at their residences and offices in Bengaluru on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X