KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్: రాఖీ బాయ్‌ కోసం శ్రీలంకన్ బ్యూటీ వస్తుంది

ఒకప్పుడు దక్షిణాది సినిమాలంటే ఆయా భాషలకే పరిమితమై ఉండేవి. కానీ, ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన సినిమాలే ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపుతున్నాయి. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాయి. అలా.. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ అయిన చిత్రమే 'KGF Chapter 1'. స్టైలిష్ హీరో యశ్ - క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయింది. అన్ని చోట్లా విజయం సాధించింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. దాని నుంచి తాజాగా ఓ న్యూస్ లీకైంది.

మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా 'KGF Chapter 2'ను తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని పాటల మినహా ఇప్పటికే పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. అందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ పాట కోసం ఆమె ఏకంగా మూడు కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Jacqueline Fernandez Special Song in KGF Chapter 2

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'KGF Chapter 2' మూవీని ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేశాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది అధీరాకు రాఖీకి మధ్య జరిగే పోరాటంతో రాబోతుంది. ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X