దటీజ్ పునీత్.. దీనికేనా మిమ్మల్ని పక్క రాష్ట్రం నుంచి పిలుచుకొచ్చింది.. జానీ మాస్టర్ కి అలా షాకిచ్చారు!

కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ కొడుకు సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనకంటూ స్పెషల్ క్రిష్ సంపాదించుకున్నారు. ఆయనకు తెలుగులో ప్రత్యేక గుర్తింపు పెద్దగా ఏమీ లేదు కానీ కన్నడలో మాత్రం పునీత్ రాజ్ కుమార్ రేంజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అలాంటి ఆయనకు జానీ మాస్టర్ కొన్ని సినిమాలకు పని చేశారు. అయితే ఒక పాట విషయంలో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

మృతి చెందినట్లు

మృతి చెందినట్లు

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం నాడు మృతి చెందారు. ఉదయం 11:30 నిమిషాలకు పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటుతో కుప్పకూలడంతో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించగా ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

కర్ణాటక ప్రభుత్వం సెలవులు

కర్ణాటక ప్రభుత్వం సెలవులు

ఇక ఇదిలా ఉంటే బెంగళూరు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కారణంగా అభిమానులు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించినట్లు భావిస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల పాటు పాఠశాలలు కాలేజీలకు కర్ణాటక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

 'యువరత్న' సినిమాకు కూడా

'యువరత్న' సినిమాకు కూడా

పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ డ్యాన్స్ విషయంలో చాలా ఫేమస్ 'నటసార్వభౌమ', 'యువరత్న' సినిమాల కోసం జానీ మాస్టర్ ఆయనకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌లలో ఒకరైన జానీ మాస్టర్ కన్నడ, తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ పనిచేశారు. గతంలో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి 'రాజకుమార', 'నటసార్వభౌమ' చిత్రాల్లో పని చేసిన ఆయన 'యువరత్న' సినిమాకు కూడా కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

అందుకేనా?

అందుకేనా?

అయితే ఒక సందర్భం గురించి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దర్శకుడుగా మారిన ఓ సీనియర్ కొరియోగ్రాఫర్ మాటల సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల కిందట పునీత్ సినిమాకు జానీ మాస్టర్ బృందంలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఓ స్టెప్పు కొద్దిగా కష్టంగా ఉంటూ బాగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ రిహార్సల్స్ ని డిమాండ్ చేస్తోంది. హీరోకు చెప్పకుండా వీళ్ళే మార్చేద్దాం అనుకున్నారట. అది కాస్తా బయటికి తెలిసిపోయింది. దీంతో హీరో జానీ మాస్టర్ ను పిలిపించారట. "ప్రాక్టీస్ ఇబ్బందని చెప్పి స్టెప్స్ ని మార్చేస్తారా. దీనికేనా మిమ్మల్ని పక్క రాష్ట్రం నుంచి పిలుచుకు వచ్చింది. ఎంత రిస్క్ అయినా చేసి తీరాల్సిందే, రాజీ వద్దు. మనం సరిగా చేయలేదని అభిమాని టికెట్ డబ్బులో డిస్కౌంట్ ఇవ్వంగా. అలాంటప్పుడు కాంప్రమైజ్ ఎందుకు? మీరు కానివ్వండి నేను చేస్తానని అన్నారట.

Recommended Video

Bigg Boss Telugu 5 లో Groupism లొల్లి ! || Filmibeat Telugu
పాట బ్రహ్మాండంగా

పాట బ్రహ్మాండంగా

అలా ఆ తర్వాత మాస్టర్ ఊహించిన దాని కన్నా పాట బ్రహ్మాండంగా వచ్చిందట. అలా పునీత్ కష్టపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఇక జానీ మాస్టర్ పునీత్ రాజ్ కుమార్ మృతి విషయంలో స్పందించారు. గద్గద స్వరంతో వీడియో విడుదల చేసిన ఆయన ఒక గొప్ప మనిషిని కోల్పోయామని, కేవలం కన్నడ ఇండస్ట్రీ హీరోను కోల్పోవడం కాదు, ఒక గొప్ప మనిషిని మానవాళి కోల్పోయిందని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X