కమల్ హాసన్‌కు కర్ణాటక కోర్టులో ఎదురు దెబ్బ! నీకు హక్కుందా? హైకోర్టు న్యాయమూర్తి మందలింపు!

కర్ణాటక హైకోర్టులో నటుడు కమల్ హాసన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. థగ్ లైఫ్ సినిమా రిలీజ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ, అదే విధంగా సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో సజావుగా ప్రదర్శనలు నడిచే విధంగా పోలీసు విభాగానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన సోమవారం ఓ పిటిషన్ తన లాయర్ ద్వారా దాఖలు చేశారు. కమల్ హాసన్ తరుఫు న్యాయవాది చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు మంగళవారం దానిని విచారించింది. ఈ సందర్భంగా కమల్ తీరుపై న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు డెక్కన్ హెరాల్డ్ తన కథనంలో పేర్కొన్నది. ఈ వివాదం వెనుక కారణం, కోర్టు మందలిపు వివరాల్లోకి వెళితే..

చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు. కమల్ మాట్లాడుతూ.. ఆయన ముందే కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని కామెంట్ చేశాడు. ఆయన మాటలు కన్నడ భాషాభిమానుల మనోభావాలను దెబ్బ తీశాయి. దాంతో కమల్ హాసన్‌పై కన్నెర్ర చేశారు. కన్నడ భాషాభిమానులు, ప్రజల మనోభావాలను, సెంటిమెంట్‌ను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన ఆయన వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Kamal Haasan has to render sorr

కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ కానివ్వమని పలు సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయితే తాను కన్నడ భాషపై ఎలాంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. తనకు తమిళ భాషపై ఎంత ప్రేమ ఉందో కన్నడ భాషపై కూడా అంతే ప్రేమ ఉంది. తాను చేయని తప్పుకు క్షమాపణ చెప్పను అని కమల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వివాదం చెలరేగడం, థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీవ్రంగా స్పందించింది. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ తరపు న్యాయవాదితో మౌఖికంగా మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే.. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.

గతంలో కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో సీ రాజగోపాలచారి, రజనీకాంత్ ఉన్నారు. వారు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటూ క్షమాపణలు చెప్పారు. కమల్ హాసన్ ఎందుకు సారీ చెప్పరు? అంటూ న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి నిలదీసినట్టు డెక్కన్ హెరాల్డ్ పత్రిక కథనంలో పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసే హక్కు ఆయన (కమల్)కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది.

ప్రజలకు నేల, నీరు, భాష అంటే ఎనలేని మక్కువ. తమ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను కన్నడ ప్రజలు ఏం అడుగుతున్నారు? కేవలం వివరణ, క్షమాపణ మాత్రమే కద. ఈ వివాదం సృష్టించింది కమల్ హాసన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీలు వేదికల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలి. తప్పులు ఎవరైనా చేస్తారు. తప్పు చేసిట్లయితే దానికి క్షమాపణ చెప్పాలి. దానికి మీరు అతీతులు కాదు. సారీ చెబితే ఈ సమస్య, వివాదం ముగింపు లభిస్తుంది అని న్యాయమూర్తి జస్టిస్ నగప్రసన్న వ్యాఖ్యలు చేసినట్టు కథనంలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X