సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్.. యువ హీరో అరెస్ట్
హిజబ్ వివాదంపై ట్వీట్ చేసిన యువ హీరో ఏ చేతన్ కుమార్‌ను ఇబ్బందుల్లో పడ్డారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ తీర్పును ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్‌ను కోర్టు ధిక్కారంగా పరిగణించి చేతన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 10 తేదీన హిజబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు రితూరాజ్ అవస్తీ, జస్టిస్ కృష్ణ దీక్షిత్, ఖాజీ జైబున్నీసా మొహినుద్దీన్ విచారణ ప్రారంభించారు. అయితే ఈ వివాదంపై నటుడు చేతన్ స్పందించడం వివాదంగా మారింది.
చేతన్ కుమార్ వివాదంపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ అనుచెత్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు జడ్జీల గురించి అనుచితమైన వ్యాఖ్యలను చేతన్ కుమార్ చేశారు. వాటిని తీవ్రంగా పరిగణించిన ఆయనను అరెస్ట్ చేశాం. చేతన్‌పై ఐపీసీ సెక్షన్ 505 (2), సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశాం అని తెలిపారు.

చేతన్ కుమార్ అరెస్ట్‌పై ఆయన భార్య మేఘన స్పందించారు. చేతన్‌ను శేషాద్రిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. తన భర్త ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అధికారులు స్పందించడం లేదు. నా భార్తను ఎక్కడికి తీసుకెళ్లారో జాడ తెలియదు. నా భర్త ఆచూకీకి సంబంధించిన వివరాలను, సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. నా భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. నా భార్తను కిడ్నాప్ చేశారా అనే అనుమానం కలుగుతున్నది అని అన్నారు.
నటుడు చేతన్ కుమార్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ ఎదుట, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు పలు సంఘాలకు చెందిన సామాజిక కార్యకర్తలు ధర్నా చేశారు. చేతన్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











