సోషల్ మీడియాలో యువ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసి అమెరికాకు తరలింపు?
బ్రహ్మణ కులంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ అహింస చుట్టు న్యాయపరమైన చిక్కులు చుట్టుకొంటున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కేసు నమోదు కావడంతో చట్టపరమైన విచారణ జరుగుతున్నది. తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకొంటూ.. సమాజంలో ప్రతీ ఒక్కరు సమానమే. కొందరు అధిపత్య ధోరణితో వ్యవహరించే వారిని ఛాలెంజ్ చేశాను అని అన్నారు. అయితే అతడిని అమెరికాకు పంపించేందుకు పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. ఈ వివారాల్లోకి వెళితే..
బ్రహ్మణ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేతన్‌పై కన్నడ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి డీజీపీ ఆఫీస్‌లో విచారించారు. అయితే డీజీపీ ఆఫీస్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం.. అమెరికా పౌరసత్వాన్ని కలిగిన చేతన్‌ను అక్కడికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు పంపించాలనే విషయంపై పోలీసులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే చేతన్ వివాదంపై కర్ణాటక హోంమంత్రి స్పందించడానికి నిరాకరించారు.

ఇటీవల చేతన్ కుమార్ వివాదంపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ అనుచెత్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు జడ్జీల గురించి అనుచితమైన వ్యాఖ్యలను చేతన్ కుమార్ చేశారు. వాటిని తీవ్రంగా పరిగణించిన ఆయనను అరెస్ట్ చేశాం. చేతన్‌పై ఐపీసీ సెక్షన్ 505 (2), సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశాం అని తెలిపారు.
చేతన్ కుమార్ అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించడంపై ఆయన భార్య మేఘన స్పందించారు. చేతన్‌ను శేషాద్రిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. తన భర్త ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అధికారులు స్పందించడం లేదు. నా భార్తను ఎక్కడికి తీసుకెళ్లారో జాడ తెలియదు. నా భర్త ఆచూకీకి సంబంధించిన వివరాలను, సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. నా భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. నా భార్తను కిడ్నాప్ చేశారా అనే అనుమానం కలుగుతున్నది అని అన్నారు.
నటుడు చేతన్ కుమార్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ ఎదుట, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు పలు సంఘాలకు చెందిన సామాజిక కార్యకర్తలు ధర్నా చేశారు. చేతన్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











