twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ నటుడు మృతి.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

    |

    కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ హీరో మరణంతో అందరూ షాక్‌కు గురయ్యారు. యువ హీరోకు గుండె పోటు రావడంతో ఆయన తాజాగా తన తుది శ్వాసను విడిచాడు. దీంతో శాండల్ వుడ్ అంతా శోక సంద్రంలో మునిగింది. ఆ నటుడు వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Kannada Actor Chiranjeevi Sarja గుండెపోటుతో మృతి
    రీమేక్ హీరో..

    రీమేక్ హీరో..


    రీమేక్‌ల స్పెషలిస్ట్ అయిన ప్రముఖ హీరో చిరంజీవి (39) సర్జా కన్నుమూసాడు. ఈయన తన కెరీర్‌లో చేసిన సినిమాలో అత్యధిక భాగం రీమేక్‌లే. పక్క భాషల్లో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేయడంతో స్టార్‌గా ఎదిగాడు. కెరీర్ మొత్తంలో 19 సినిమాలు చేస్తే అందులో 14 సినిమాలు రీమేక్‌లే.

    గుండె పోటుతో..

    గుండె పోటుతో..

    జూన్ 6న ఈయనకు శ్వాసకోశ సమస్య వచ్చింది. వెంటనే అతన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వయసు చాలా తక్కువ కావడంతో ఇది హృదయ సంబంధిత వ్యాధి అని కుటుంబం కూడా అనుకోలేదు. కానీ ఊపిరి ఆడకుండా ఉండటంతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చింది. గుండెపోటుతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

    వైద్యుల ప్రయత్నం వృథా..

    వైద్యుల ప్రయత్నం వృథా..

    అయితే ఇంత చిన్న వయసులో హృదయ సంబంధిత వ్యాధి రావడం అందర్నీ ఆశ్చర్యపరింది. చివరి నిమిషం వరకు ఈ హీరోను బతికించడానికి వైద్య బృందం ప్రయత్నించింది. కానీ చివరకు వారి ప్రతయ్నం ఫలించలేదు.

    యాక్షన్ కింగ్ అర్జున్‌కు బంధువు..

    యాక్షన్ కింగ్ అర్జున్‌కు బంధువు..

    చిరంజీవి సర్జా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు దగ్గరి బంధువు అవుతాడు. వరుసకి మేనళ్లుడు అవుతాడు. చిరంజీవి మరణంతో ఆయన భార్య మేఘనా రాజ్ కుప్పకూలిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Kannada ACtor Chiranjeevi Sarja Passed Away. Kannada actor Chiranjeevi Sarja passed away on Sunday. The 39-year-old actor died due to heart attack, according to reports. He died at a private hospital in Bengaluru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X