యువ నటుడి తీవ్ర గాయాలు.. పరిస్థితి క్రిటికల్‌గా.. ప్రత్యేక విమానంలో బెంగళూరు తరలింపు!
కన్నడ నటుడు దిగంత్ తీవ్రంగా గాయపడటంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గోవాలో కుటుంబంతో విహార యాత్ర చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. అయితే వెన్నుపూసకు గాయం కావడంతో వెంటనే చికిత్స కోసం గోవా నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. దిగంత్ గాయపడిన వార్త వివరాల్లోకి వెళితే..

రొటీన్ వ్యాయాయం చేస్తుండగా..
ఇటీవల యువ నటుడు దిగంత్ తన కుటుంబంతో గోవాకు వెళ్లారు. రొటీన్ వ్యాయామంలో భాగంగా వెనుకకు పల్టీ కొడుతుంటే మిస్ అయి తలపైన పడిపోయాడు. దాంతో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. దాంతో ఆయనను గోవా నుంచి విమానంలో బెంగళూరుకు తరలించారు.

పట్టుజారి వెనుకకు పడిపోవడంతో
గోవాకు కుటుంబ సభ్యులమంతా విహార యాత్రకు వచ్చాం. స్పోర్ట్స్‌కు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నాం. అయితే పట్టుజారి దిగంత వెనుకవైపు పడిపోయాడు. సెర్వికల్ వెర్టెబ్రాలో ఎముక డిస్ లోకేట్ అయ్యాయి. దాంతో ఆయన చేతికి తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. అయితే డాక్టర్లు ప్రమాదాన్ని పసిగట్టి.. వెంటనే మెరుగైన చికిత్స అవసరం అని చెప్పారు. దాంతో బెంగళూరుకు తరలించాం అని దిగంత్ కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.

దిగంత ఆరోగ్యం విషమంగా
దిగంత్ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే హాస్పిటల్ వర్గాలు, డాక్టర్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

దిగంత్‌కు రెండోసారి ప్రమాదం
అయితే దిగంత్ ఇలాంటి ప్రమాదానికి గురికావడం రెండోసారి. గతంలో అంటే.. 2017లో టికెట్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్ సమయంలో కంటికి తీవ్రగాయమైంది. కార్నియా దెబ్బ తినడంతో సర్జరీ చేశారు.

దిగంత్ కెరీర్ ఇలా..
కన్నడ సినిమా రంగంలో యువ నటుడిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు. 2006లో కెరీర్ ఆరంభించి.. ఇప్పటికే 35 సినిమాల్లో నటించాడు. పంచరంగి, గాలిపట చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల ముంగరు మాలే సినిమాలో నటించారు.


Click it and Unblock the Notifications











