పరారీలో స్టార్ హీరో మొదటి భార్య, పోలీసులు అదుపులో కుమార్తె.. కుటుంబంలో ఊహించని ఘటనలు!
Recommended Video

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బయట సమస్యలతో విజయ్ సతమతమవుతున్నాడు. మరో వైపు ఇంటిపోరు అధికమవుతోంది. గత కొన్ని రోజులుగా దునియా విజయ్ వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జిమ్ ట్రైనర్ ని దాడి చేసిన కేసులో దునియా విజయ్ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అతడి మొదటి భార్య నాగ రత్న, రెండవ భార్య కీర్తి వివాదం తారాస్థాయికి చేరుతోంది.

పరారీలో నాగరత్న
ఇటీవల దునియా విజయ్ రెండవ భార్యపై నాగరత్న చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి నాగరత్న ఇంటికి వెళితే ఆమె పరారీలో ఉన్నట్లు తేలింది. ఇంట్లో నాగరత్న కుమార్తె మోనిక మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మోనికని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే నాగరత్నఎక్కడ ఉన్నది కనిపెట్టి అరెస్టు చేస్తాం అని పోలీసులు చెబుతున్నారు.

మొదటి భార్యకు దూరంగా
దునియా విజయ్ చాలా కాలంగా తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్నాడు. నాగరత్న మాత్రం తమ మధ్య ఇంకా విడాకులు జరగలేదని, ఆయనే తన భర్త అని చెబుతోంది. కీర్తి వచ్చాక తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని నాగ రత్న పలు సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. విజయ్ మాత్రం కీర్తితో కలసి జీవనం సాగిస్తున్నాడు.

కుమార్తెపై దాడి
విజయ్ పై మరో కేసు కూడా నమోదైంది. తన తండ్రే తనపై దాడికి పాల్పడ్డాడంటూ దునియా విజయ్ పెద్ద కుమార్తె ఇటీవల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనకు సంబందించిన కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్లిన సందర్భంలో సస్నేహితుడితో కలసి తన తండ్రి దాడికి పాల్పడ్డారని మోనిక ఆరోపించింది.

తీవ్రమైన ఒడిదుడుకులు
కన్నడలో స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో దునియా విజయ్ కుటుంబ పరమైన విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అది అతడి కెరీర్ పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దునియా విజయ్ తో జీవనం సాగిస్తున్న అతడి రెండవ భార్య కీర్తి గతంలో నటిగా రాణించింది.


Click it and Unblock the Notifications











