రోడ్డు ప్రమాదానికి గురైన యువ హీరో.. తీవ్ర గాయాలతో ఐసీయూలో!

కన్నడ సినిమా రంగంలో పాపులర్ యాక్టర్ కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. 24 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కిరణ్ రాజ్ ప్రమాదానికి గురించిన వివరాల్లోకి వెళితే..

నటుడు కిరణ్ రాజ్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు కెన్‌గెరీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం తొలుత డివైడర్ ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆయన కారు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Kannada Actor Kiran Raj s Mercedes Benz met road accident Ronny Star admitted in ICU of Bangalore Hospital

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. ఆయన ఛాతీకి బలమైన గాయం తగలిందని వైద్యులు వెల్లడించారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగానే ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 24 గంటల తర్వాత ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు అందిస్తాం అని వైద్యులు తెలిపారు.

మీడియా కథనం ప్రకారం.. రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో కిరణ్ రాజ్ నలుపు రంగు మెర్సిడెజ్ బెంజ్ కారులో తన స్నేహితుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌తో కలిసి ఉన్నారు. తన స్నేహితుడికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనకు కూడా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు అని వైద్యులు తెలిపారు.

Kannada Actor Kiran Raj s Mercedes Benz met road accident Ronny Star admitted in ICU of Bangalore Hospital

కిరణ్ రాజ్ కెరీర్ విషయానికి వస్తే.. టెలివిజన్ షోల ద్వారా గుర్తింపు పొందారు. ఆయన కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. తాను నటించిన రాణి సినిమా విడుదల నేపథ్యంలో చేస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన షో షూటింగ్ పూర్తి చేసుకొని వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది అని స్నేహితులు చెప్పారు.

ఇదిలా ఉండగా, కిరణ్ రాజ్ నటించిన రాని: ది రూలర్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు గురుతేజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాధ్యా, సమీక్ష, రవిశంకర్, బీ సురేష్, అపూర్వ, ఉగ్రం మంజు, ఉగ్రం రవి, యష్ శెట్టి, ధర్మాన, గిరిష్ హెగ్డే, కరి సుబ్బు తదితరులు నటించారు. ఈ సినిమాకు ఓ రోజు ముందు ఆయన ప్రమాదానికి గురి కావడం ఆన అభిమానులకు షాకింగ్‌గా మారింది.

More from Filmibeat

Read more about: kiran raj ronny the ruler
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X