సినీ పరిశ్రమలో మరో విషాదం.. శబరిమల యాత్రకు బయలుదేరే ముందు కుప్పకూలి నటుడు మృతి!
సౌత్ ఇండస్ట్రీ నుంచి మరో బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌత్ సినిమాల్లో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్న సీనియర్ నటుడు శివరాం కన్నుమూశారు. ఆయనకు 83 ఏళ్లు. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస విషాదాలు
గత కొద్ది రోజులుగా దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు శివశంకర్ మసాటర్, మొన్నటికి మొన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయగా ఇప్పుడు ప్రముఖ కన్నడ నటుడు శివరాం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

శబరిమల యాత్రకు బయలుదేరే ముందు
నవంబర్ 30వ తేదీ రాత్రి శబరిమల యాత్రకు బయలుదేరే ముందు పూజలు చేస్తుండగా ఆయన తన నివాసంలో కుప్పకూలిపోయారు. ఈ నెలలోనే శబరిమల దర్శనానికి ప్లాన్ వేసుకున్నాడు. కానీ విధి ఆయనను ఆ భగవంతుని వద్దకు తీసుకు వెళ్లిపోయింది. ఇక నివేదికలలో వైద్యుల విచారణ తరువాత, నటుడు శివరాం మెదడు రక్తస్రావం అయిన కారణంగా మరణించినట్లు తెరపైకి వచ్చింది

కారు ప్రమాదానికి గురై
నటుడు శివరామ్ అకాల మరణంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బెంగళూరులోని తన నివాసంలో పూజ చేస్తూ ఆయన కుప్పకూలడంతో మెదడులో రక్తస్రావం జరిగింది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు అతని వయస్సు మరియు ఇతర సమస్యల కారణంగా శస్త్రచికిత్సను చేయడానికి సాహసించలేదు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు డిసెంబర్ 4న తుదిశ్వాస విడిచారు. గత వారం శివరామ్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయితే అతనికి పెద్దగా గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అతని అంత్యక్రియలు మరియు అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

సినీ ఎంట్రీ అలా
శివరామ్ జనవరి 28, 1938న జన్మించారు. అతను 1958లో సహాయ దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యారు. దీంతో ఆయన దర్శకుడులు KR సీతారామశాస్త్రి, పుట్టన్న కనగల్ మరియు సింగీతం శ్రీనివాసరావు వద్ద పనిచేశారు. అతను 1965లో బెరెతా జీవా అనే సినిమాతో నటనలోకి ప్రవేశించాడు. కొన్నేళ్లుగా శివరామ్ క్యారెక్టర్ యాక్టర్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు.

ఆత్మకు శాంతి చేకూర్చాలని
అనేక చిత్రాలలో సహాయ నటుడిగా, నటుడిగా సత్తా చాటిన శివరామ్ 1972లో హృదయ సంగమ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అతను కన్నడలో కొన్ని చిత్రాలను మరియు తమిళంలో రజనీకాంత్ యొక్క ధర్మ దురై చిత్రాలను నిర్మించారు. శివరామ్ మృతి కన్నడ చిత్రసీమను విషాదంలో ముంచెత్తింది. ఇదిలావుంటే, కన్నడ సినీ ప్రముఖుడు శివరాం మరణం చాలా బాధాకరం. కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయారని కన్నడ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. .


Click it and Unblock the Notifications











