యువ నటుడు దారుణ హత్య.. గొంతు కోసి నిందితుల పరారీ.. సినీ పరిశ్రమలో దిగ్బ్రాంతి!

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. వర్థమాన నటుడు వజ్ర సతీష్ దారుణ హత్యకు గురికావడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువ నటుడు హత్య వెనుక కుట్రను బయటకు లాగేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వజ్ర సతీష్ హత్య, ఈ కేసు వివరాల్లో వెళితే..

రక్తపు మడుగులో యువ నటుడు

రక్తపు మడుగులో యువ నటుడు

కర్ణాటక పోలీసులు మీడియాకు తెలిపిన ప్రకారం.. వజ్ర సతీష్ హత్య పట్టానాగేరే‌లోని RR నగర్‌లో జరిగింది. ఈ ప్రాంతంలోని ఇంటి యజమాని హేమంత్ కుమార్ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలిపారు. కొద్దికాలంగా వజ్ర సతీస్ తన ఇంటిలో ఉంటున్నాడు. రెండో ఫ్లోర్‌లోని తన నివాసంలో రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి చూశాను. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు.

గదికి తాళం వేయడంతో..

గదికి తాళం వేయడంతో..

మాండ్య జిల్లాకు చెందిన వజ్ర సతీష్ ఇంటికి తాళం వేసి ఉండటంతో మరో తాళంతో గది తలుపులు తెరిచాం. అప్పటికే బెడ్‌రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దుండగులు ఆయన గొంతును కత్తితో కోశారు. కడుపులో కత్తి గాయాలు ఉన్నాయి అని పోలీసులు తెలిపారు.

లగోరి సినిమా ద్వారా

లగోరి సినిమా ద్వారా

నటనపై ఆసక్తి పెంచుకొన్న వజ్ర సతీష్ ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు పొందే పాత్రలను పోషిస్తున్నాడు. లగోరి అనే సినిమా ద్వారా కన్నడ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు. యాక్టింగ్‌తోపాటు సెలూన్‌ను నడుపుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఏడు నెలల క్రితమే తన భార్య మరణించింది. వజ్ర సతీష్‌కు కొడుకు ఉన్నాడు అని కర్ణాటక పోలీసులు మీడియాకు వివరాలు అందించారు.

సతీష్ భార్య మరణంపై అనుమానాలు

సతీష్ భార్య మరణంపై అనుమానాలు

అయితే తన భార్యను వజ్ర సతీష్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఆ తర్వాత భార్య మరణించడంతో ఆయనపై అనేక అనుమానాలు వచ్చాయి. మరణం వెనుక సతీష్ హస్తం ఉంది. భార్యను విపరీతంగా వేధించాడు. ఆయన వేధింపులు తట్టుకొలేక మరణించింది అని సతీష్ బావమరుదులు తెలిపారు. భార్య మరణం తర్వాత తన కుమారుడి పోషణ బాధ్యతను కుటుంబానికి అప్పగించారు. అప్పడప్పుడు కొడుకును చూడటానికి వెళ్లేవాడు. తన కొడుకును తన వద్దకు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అంతలోనే ఈ ఘటన జరిగిందని సన్నిహితులు తెలిపారు.

అదను చూసి.. వేటు వేసి..

అదను చూసి.. వేటు వేసి..

తమ చెల్లెలి అనుమానాస్పద మరణం తర్వాత బావ వజ్ర సతీష్‌పై బావమరదులు కోపం పెంచుకొన్నారు. అతడికి సరైన గుణపాఠం నేర్పాలని అదనుకోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో అదను చూసుకొన్న బావ మరిది మరో వ్యక్తి నాగేంద్రతో కలిసి సతీష్‌ను హత్య చేశారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు అని పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X