twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రైవర్ హత్య కేసులో హీరోయిన్, ఆమె తల్లి అరెస్ట్!

    |

    మూడు నెలల తర్వాత కర్నాటక పోలీసులు రౌడీ షీటర్ హత్య కేసులో 30 ఏళ్ల నటిని, 55 ఏళ్ల ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. కన్న సినీ నటి సవిత, ఆమె తల్లి నాగమ్మను చెన్నపట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీల్ అనే రౌడీ షీటర్ హత్య జనవరి 29న జరుగ్గా దీనికి సంబంధించి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

    రాంపురం గ్రామానికి సునీల్ హత్య సంబంధించి ఇప్పటికే అతడి ప్రత్యర్థులు శివరాజు, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో ఈ హత్య వెనక సవిత, నాగమ్మ ప్రేమయం ఉన్నట్లు తేలింది. వీరు కూడా అదే గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం.

    సవిత, సునీల్ బంధువులు

    సవిత, సునీల్ బంధువులు

    సునీల్, సవిత మధ్య బంధుత్వం కూడా ఉంది. సవిత కారు డ్రైవర్‌గా కూడా అతడు పని చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన వివాదాలు ఏర్పడ్డాయి. ఈ గొడవ కారణంగా సునీల్‌ను పనిలో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వారిని బెదిరిస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

    వ్యక్తిగత కక్షలతో శివరాజు, మను

    వ్యక్తిగత కక్షలతో శివరాజు, మను

    శివరాజు, మను వ్యక్తిగత కక్షలతో సునీల్‌ను చంపడానికి ప్లాన్ చేయగా...వీరికి సవిత నాగమ్మ సహాయం చేశారని పోలీసులు తెలిపారు. సునీల్ కదలికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందించడం మొదలు పెట్టారు. అతడి చంపేస్తే తమ సమస్య కూడా సాల్వ్ అవుతుందని వారు భావించినట్లు తెలుస్తోంది.

    మారణాయుధాలతో దాడి చేసి

    మారణాయుధాలతో దాడి చేసి

    సునీల్ రాంపుర పాంహౌస్‌లో ఉన్న విషయం సవిత, నాగమ్మకు తెలియడంతో ఈ సమాచారాన్ని శివరాజు, మనుకు అందించారు. దీంతో వారు ముందు అనుకున్న పథకం ప్రకారం అక్కడికి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

    కన్నడ నటి

    కన్నడ నటి

    కన్నడ చిత్రం ‘హెండతియోబ్బలు మనయోలగిద్దరే' అనే చిత్రంలో సవిత లీడ్ రోల్ చేసింది. దీంతో పలు సౌత్ చిత్రాల్లో నటించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

    English summary
    Kanada Actress and her mother were arrested by Channapatna police, allegedly facilitating the killing her driver Sunil. Sunil was murdered on January 29, allegedly by rivals from the village, Shivaraju and Manu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X