Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రైవర్ హత్య కేసులో హీరోయిన్, ఆమె తల్లి అరెస్ట్!
మూడు నెలల తర్వాత కర్నాటక పోలీసులు రౌడీ షీటర్ హత్య కేసులో 30 ఏళ్ల నటిని, 55 ఏళ్ల ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. కన్న సినీ నటి సవిత, ఆమె తల్లి నాగమ్మను చెన్నపట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సునీల్ అనే రౌడీ షీటర్ హత్య జనవరి 29న జరుగ్గా దీనికి సంబంధించి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాంపురం గ్రామానికి సునీల్ హత్య సంబంధించి ఇప్పటికే అతడి ప్రత్యర్థులు శివరాజు, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో ఈ హత్య వెనక సవిత, నాగమ్మ ప్రేమయం ఉన్నట్లు తేలింది. వీరు కూడా అదే గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం.
సవిత, సునీల్ బంధువులు
సునీల్, సవిత మధ్య బంధుత్వం కూడా ఉంది. సవిత కారు డ్రైవర్‌గా కూడా అతడు పని చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన వివాదాలు ఏర్పడ్డాయి. ఈ గొడవ కారణంగా సునీల్‌ను పనిలో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వారిని బెదిరిస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
వ్యక్తిగత కక్షలతో శివరాజు, మను
శివరాజు, మను వ్యక్తిగత కక్షలతో సునీల్‌ను చంపడానికి ప్లాన్ చేయగా...వీరికి సవిత నాగమ్మ సహాయం చేశారని పోలీసులు తెలిపారు. సునీల్ కదలికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందించడం మొదలు పెట్టారు. అతడి చంపేస్తే తమ సమస్య కూడా సాల్వ్ అవుతుందని వారు భావించినట్లు తెలుస్తోంది.
మారణాయుధాలతో దాడి చేసి
సునీల్ రాంపుర పాంహౌస్‌లో ఉన్న విషయం సవిత, నాగమ్మకు తెలియడంతో ఈ సమాచారాన్ని శివరాజు, మనుకు అందించారు. దీంతో వారు ముందు అనుకున్న పథకం ప్రకారం అక్కడికి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.
కన్నడ నటి
కన్నడ చిత్రం ‘హెండతియోబ్బలు మనయోలగిద్దరే' అనే చిత్రంలో సవిత లీడ్ రోల్ చేసింది. దీంతో పలు సౌత్ చిత్రాల్లో నటించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.