ప్రియుడు మోసగించాడని యువ నటి సూసైడ్.. మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో..
యువ నటి చందన ఆత్మహత్యతో కన్నడ పరిశ్రమలో విషాదం చోటుచేసుకొన్నది. ఆమె మరణవార్త వినగానే కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఇప్పుడిప్పుడే అందరి మన్ననలు అందుకొంటూ వృద్ధిలోకి వస్తున్న ఈ నటి, యాంకర్ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం అందర్ని కలిచివేసింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..

టెలివిజన్ యాంకర్‌గా, నటిగా
కన్నడ పరిశ్రమలో చందన టెలివిజన్ యాంకర్‌గా, సినీ నటిగా రాణిస్తున్నారు. గత కొద్దికాలంగా ఆమె పోషించిన పాత్రలు, యాంకరింగ్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల కాలంలో ఆమె దినేష్ అనే వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే ప్రియుడు మోసగించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరణానికి ముందు సెల్పీ వీడియో
చందన తన మరణానికి ముందు సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. తన మరణానికి కారణాలు వెల్లడిస్తూ సూసైడ్ చేసుకొన్నారు. ప్రస్తుతం చందన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నది. తాను తీసిన వీడియోను తన మరణానికి ముందు దినేష్ కుటుంబ సభ్యులకు, తన తల్లిదండ్రులకు, స్నేహితులకు షేర్ చేసింది.

తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే
చందన తీవ్రమైన నిర్ణయాన్ని తెలుసుకొన్న ఆమె తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. ఆమెను కాపాడటానికి పొరుగింటి వారికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పొరుగింటి వారు చూడగానే చందన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు హాస్పిటల్ తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.

నిందితుడి కోసం గాలింపు
చందన సూసైడ్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దినేష్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దినేష్ కోసం ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి అరెస్ట్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చందన సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు
చందన మరణం తర్వాత బెంగళూరు పోలీసుల చేపట్టిన దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల క్రితం చందన నుంచి రూ.5 లక్షల తీసుకొన్నాడని, తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని తెలిసింది. అంతేకాకుండా వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడం, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో చందన అనూహ్య నిర్ణయం తీసుకొందని పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











