For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నా, హాస్పిటల్‌కి పంపించండి.. జైల్లో హీరోయిన్ ఆవేదన

  |

  కన్నడ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని వారాల నుంచి డ్రగ్స్ వ్యవహారం ఏ స్థాయిలో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ జైల్లో ఒక సాధారణ ఖైదీలుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జైలుకు వెళ్లిన రోజూ నుంచి కూడా కేసు విషయంలో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల రాగిణి కారాగారంలో గాయపడినట్లు తెలిసింది. ఒక్కసారిగా ఈ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

  హీరోయిన్ గాయలపై అనుమానాలు

  హీరోయిన్ గాయలపై అనుమానాలు

  కారాగారంలో అనుకోకుండా జారి పడినట్లు చెప్పిన రాగిణి తీవ్రంగా గయాపడినట్లు ఇటీవల జైలు అధికారులకు తెలియజేసింది. అయితే వెంటనే తనను ఒక ప్రయివేటు హాస్పిటల్ కి పంపించే ఏర్పాట్లు చేయాలని రాగిణి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చెలింది. ఇక మీడియాలో మొదట రాగిణి గాయలపై వివిధ రకాల అనుమానాలను వ్యక్తం చేయగా వెంటనే ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆమే అనుకోకుండా గాయాపడినట్లు చెప్పారు.

  ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లాలని..

  ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లాలని..

  కారాగారంలోని వైద్యశాలలోనే చికిత్స ఇస్తున్నప్పటికీ నడుము, వెన్నుకు కాస్త గట్టి దెబ్బలు తగిలాయని చెప్పిన ఆమె ఎలాగైనా ప్రయివేటు హాస్పిటల్ చికిత్స తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే ఆమెకు ఎలాంటి చికిత్స అయినా కూడా కూడా జైలులోనే అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాగిణి మాత్రం బయటకు వెళ్లి చికిత్స తీసుకోవాలని పట్టుపట్టిందని తెలుస్తోంది.

  23వరకు జైల్లోనే..

  23వరకు జైల్లోనే..

  డ్రగ్స్‌ కేసులో గత కొన్ని రోజుల క్రితం అరెస్టయిన రాగిణి న్యాయనిర్బంధంపై గత వారమే విచారణ జరపాల్సింది. ఇటీవల విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో 23వ తేదీ వరకు కూడా రాగిణి అలాగే మరొక హీరోయిన్ సంజనా కూడా జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఇక గాయం కారణంగా ఆమె అర్జీని ఇటీవల విచారణకు స్వీకరించిన కోర్టు ఆక్షేపణలను దాఖలు చేసేందుకు సీసీబీ పోలీసులకు అవకాశం కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది.

  ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
  హీరోతో పాటు టీవీ యాంకర్ అరెస్ట్..?

  హీరోతో పాటు టీవీ యాంకర్ అరెస్ట్..?

  ఇక కన్నడ పరిశ్రమలో కేవలం ఇద్దరి హీరోయిన్లను మాత్రమే టార్గెట్ చేయడం దారుణం అనే కామెంట్స్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. విచారణలో ఇప్పటికే పలువురు పేర్లు బయటపడ్డప్పటికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న హీరోలను రాజకీయ నాయకుల కొడుకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇక త్వరలోనే ఒక స్టార్ హీరోతో పాటు సీనియర్ టీవీ యాంకర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

  English summary
  Sanjjanaa Galrani responded on drug links: Why attack only on heroines. Sanjjanaa Galrani's assistant Rahul arrested news goes viral in Kannada film industry. It sent shock waves in the sandalwood. Report suggest that Sanjjanaa Galrani may get summons in drug rocket case after Rahul arrest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X