కన్నడ హీరోయిన్, మాజీ ఎంపి రమ్య మృతి వార్త వైరల్.. ఖండించిన ఫ్యామిలీ

కన్నడ నటి, రాజకీయ వేత్త మాజీ ఎంపీ రమ్య స్పందన ఇకలేరు అనే వార్తను కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఖండించాయి. గత రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్టు వచ్చిన వార్తలు తమను బాధించాయని తెలిపారు. రమ్య ఆరోగ్యంగా ఉన్నారంటూ కుటుంబ సభ్యులు, పార్టీ, సినీ వర్గాలు ధృవీకరించారు. ఆమె మరణ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, సినీ ప్రముఖులు ఆమె మరణం వార్తను ఖండిస్తున్నారు.

అయితే రమ్య క్షేమంగానే ఉన్నారు. ఆమెతో ఇప్పడే మాట్లాడాను. ప్రస్తుతం ఆమె ప్రాగ్ దేశంలో ఉంది. గురువారం బెంగళూరు చేరుకొంటారు అని ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రమణ్యం ట్వీట్ చేసింది. మరో ట్విట్‌లో దివ్య స్పందన జెంటిల్ ఉమెన్‌తో వండర్‌ఫుల్ మీటింగ్ జరిగింది. జెనీవాలో డిన్నర్ చేశాం. బెంగుళూరు గురించి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకొన్నాం అని చిత్ర సుబ్రమణ్యం చెప్పింది.

Kannada Actress Ramya alias Divya Spandana safe in Geneva, Friends condemns death rumour

రమ్య మృతివార్తను ధన్య రాజేంద్రన్ ఖండించారు. దివ్య స్పందనతో ఇప్పుడే మాట్లాడాను. నా కాల్ ఎత్తే వరకు ఆమె ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. ప్రస్తుతం ఆమె జెనీవాలో ఉన్నారు. ఓ వార్తకు సంబంధించిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ట్వీట్ చేసి ఉంటాడు. అతడు ఎవరో బయటకు రావాలి. ఇలాంటి వార్తలు ట్వీట్ చేసినందుకు సిగ్గుపడాలి అని అన్నాడు.

సినీ నటి రమ్య వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే.. మండ్యాకు చెందిన ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లి రంజిత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. తండ్రి ఆర్టీ నారాయణ్ పారిశ్రామిక వేత్త. రమ్య ఓ సందర్భంలో తాను మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కూతురు అని చెప్పకోవడం సంచలనం రేపింది.

Kannada Actress Ramya alias Divya Spandana safe in Geneva, Friends condemns death rumour

సినిమా కెరీర్ విషయానికి వస్తే.. పునీత్ రాజ్‌కుమార్ నటించిన అభి సినిమాతో 2003లో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కుత్తు, ఆకాశ్, గౌరమ్మ, అమృతధార, జూలీ, తానమ్ తానమ్, క్రేజీ లోక, ఆర్యన్, నాగదహవు సినిమాలో నటించింది. ఇటీవల రిలీజైన చిత్రం హాస్టల్ హడుగరు బెకంగిడ్డరే (తెలుగులో బాయ్ హాస్టల్ చిత్రం)లో నటించింది. 2013లో జరిగిన ఉప ఎన్నికలో మాండ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించింది. ఆతర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X