హత్యకేసులో యువ హీరోయిన్ బిగుస్తున్న ఉచ్చు.. జుడిషియల్ కస్టడీకి తరలింపు

కన్నడలో శృంగార భరితమైన చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యువ హీరోయిన్ షనయా కత్వే మెడకు మర్డర్ కేసు ఉచ్చు బలంగా చుట్టుకొంటున్నది. సొదరుడు రాకేశ్ కత్వే హత్య కేసులో షనయా అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో షనయాను జుడిషియల్ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ప్రేమ వ్యవహారంలో విభేదాలు

ప్రేమ వ్యవహారంలో విభేదాలు

యువ నటి షనయా ప్రేమ వ్యవహారం సొదరుడు రాకేశ్ కత్వే మరణానికి దారి తీసింది. నియజహెమెద్ కటిగర్‌ అనే వ్యక్తితో అఫైర్ కొనసాగించడంపై రాకేశ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు వ్యతిరేకించడం జరిగింది. దాంతో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో రాకేశ్‌ను తన ప్రియుడితో కలిసి హత్య చేశారు. హుబ్బాలిలోని సొంత ఇంటిలోనే రాకేశ్ గొంతు కోసి హత్య చేశారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది.

గ్లామర్‌తో అదరగొట్టిన రత్తాలు.. ఈ సమయంలో అక్కడ రాయ్ లక్ష్మి జిగేల్

సోదరుడిని ముక్కలుగా నరికి

సోదరుడిని ముక్కలుగా నరికి

రాకేశ్ కత్వే దేహాన్ని ముక్కల ముక్కలుగా నరికి పలు అవయవాలను హుబ్బలిలోని పలు ప్రాంతాల్లోను, అలాగే గడగ్ రోడ్ ప్రాంతంలో వేశారు. రాకేశ్ హత్య విషయం వెలుగు చూడగానే అనుమానాస్పదంగా మారిన షనయాను విచారించారు. ఆ విచారణలో షనయా ప్రమేయం ఉందని రుజువు కాగానే అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఆమెను జుడిషియల్ కస్టడీకి తరలించారు.

ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా

షనయాతోపాటు మరో నలుగురు

షనయాతోపాటు మరో నలుగురు

రాకేశ్ కత్వే హత్య కేసులో షనయాతోపాటు మరో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. షనయా ప్రియుడు నియజహెమెద్, తౌసీఫ్ చన్నాపూర్, అల్తాఫ్ ముల్లా, ఆమన్ గిరానివాలే‌ను ధర్వాడ్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు హత్యకు వెనుక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

క్యాన్సర్ బారిన పడ్డ తల్లి కోసం.. పీపీఈ కిట్‌‌లో రాఖీ సావంత్ సేవలు.. కంటతడి పెట్టించేంతగా

Recommended Video

ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది !
షనయా కెరీర్ ఇలా..

షనయా కెరీర్ ఇలా..

షనయా కత్వే కెరీర్ విషయానికి వస్తే.. 2018లో ఇదమ్ ప్రేమమ్ జీవనమ్ అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒండు ఘంటేయా కథే లాంటి శృంగార భరిత చిత్రంతో పాపులర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X