రిజిస్టర్ ఆఫీసులో రహస్యంగా హీరోయిన్ రెండో పెళ్లి... కొత్త మొగుడు ఇతడే!
కన్నడ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరైన సుమన్ రంగనాథన్ వివాహం బెంగుళూరుకు చెందిన బిజినెస్‌మేన్ సాజన్ చిన్నప్పతో జరిగింది. జూన్ 3న ఎలాంటి హడావుడి లేకుండా రిజిస్టర్ ఆఫీసులో వీరి పెళ్లి రహ్యంగా జరుగడం గమనార్హం.
తమ పెళ్లి విషయమై సుమన్ రంగనాథన్ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... తన భర్త కొడగు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, గత 8 నెలలుగా తాము డేటింగులో ఉన్నట్లు తెలిపారు. పెళ్లికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోమవారం(జూన్ 3)న క్లోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.

అందుకే అలా పెళ్లి చేసుకున్నాం
మీడియాకు చెప్పకుండా ఇంత రహస్యంగా పెళ్లి చేసుకోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. తాము ఇద్దరం కూడా ప్రైవేట్ వ్యక్తులమని, ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకే కొంత మంది సమక్షంలో తమకు నచ్చినట్లు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి
మా ఇద్దరికీ ఒకేరకమైన అభిరుచులు ఉన్నాయి. వ్యక్తిత్వం దాదాపుగా ఒకేరకంగా ఉంటుంది. మేము దగ్గరవ్వడానికి ఇది కూడా ఓ కారణం అయుండొచ్చు. ఆయన చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్. తమ జీవితం ఎలా ఉండాలనే విషయంలో స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మా ఆలోచన విధానం ఒకే విధంగా ఉంది కాబట్టే దగ్గరకాలిగామని సుమన్ రంగనాథన్ తెలిపారు.

గతంలో బాలీవుడ్ నిర్మాతతో
సుమన్ రంగనాథన్ వయసు 44 సంవత్సరాలు. గతంలో ఆమె బాలీవుడ్ నిర్మాత బంటీ వాలియాను పెళ్లాడారు. అయితే వారి వైవాహిక బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. పెళ్లి జరిగిన సంవత్సరంలోపే ఇద్దరూ విడిపోయారు.

సుమన్ రంగనాథన్
సినిమా ప్రొఫెషన్ పరంగా చూస్తే... సుమన్ రంగనాథన్ 1989లో ‘సిబిఐ శంకర్' ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. కన్నడతో పాటు హిందీ, తమిళంలో కలిసి దాదాపు 50 సినిమాల వరకు నటించారు. ఆమె లేటెస్ట్ మూవీ ‘కవలుదారి' ఏప్రిల్‌లో విడుదలైంది. ప్రస్తుతం దండుపాళ్య 4, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











