మహిళపై సినీ హీరో రేప్.. డ్యాన్స్ నేర్పిస్తానని పిలిచి లైంగికదాడి.. పరారీలో నటుడు

కన్నడ నటుడు కరణ్ మహాదేవ్‌ అలియాస్‌ మంజునాథ్‌పై రేప్, కిడ్నాప్, బ్లాక్ మెయిలింగ్ కేసులు నమోదైంది. సోమవారం ఓ మహిళ అతడిపై జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హీరోపై రేప్ ఆరోపణలు రావడంతో కన్నడ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. గూళిహట్టి అనే చిత్రంలో కరణ్ మహాదేవ్ హీరోగా నటించారు. వివరాల్లోకి వెళితే..

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం

మహిళ పేర్కొన్న ప్రకారం.. హీరో కరణ్ మహాదేవ్ నాకు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అతను డ్యాన్స్ మాస్టర్ కూడా. నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఇష్టమని చెప్పడంతో తాను శిక్షణ ఇస్తాను అని చెప్పాడు. కొన్ని రోజులు ఫొన్‌లో మాట్లాడుకొన్న తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఓ చోటికి రమ్మన్నాడు అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

స్టూడియోకు పిలిచి డ్యాన్స్

స్టూడియోకు పిలిచి డ్యాన్స్

మహాదేవ్ పిలువడంతో ఉల్లాల్ ఉపనగర్‌లోని స్టూడియోలో కలిశాను. నాకు స్టూడియోలో మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తానని ప్రామిస్ చేశాడు. చాలా రోజులు డ్యాన్స్ నేర్చుకోవడానికి స్టూడియోకు వెళ్లాను. కొన్ని రోజుల తర్వాత నాతో చెడుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దాంతో నేను తిరస్కరించాను.

 చంపుతానని బెదిరింపులు

చంపుతానని బెదిరింపులు

దాంతో మహాదేవ్ వేధింపులు రోజు రోజుకు పెరిగిపోయాయి. తనకు సహకరించకపోతే చంపుతానని బెదిరించాడు. సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తానని బెదిరించాడు. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని నా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు అని పోలీసులకు మహిళ తెలిపారు.

 వీడియోలు తీసి సోషల్ మీడియాలో

వీడియోలు తీసి సోషల్ మీడియాలో

అంతేకాకుండా నా వద్ద వీడియోలు, ఆడియో ఫైల్స్ ఉన్నాయి. చాలాసార్లు నన్ను రేప్ చేసిన సమయంలో వీడియోలు తీశాడు. వాటిని బయట పెడుతానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. ఆ నేపథ్యంలోనే నేను పోలీసులను ఆశ్రయించాను అని సదరు మహిళ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రియుడికి చూపించి..

ప్రియుడికి చూపించి..

పోలీసుల తెలిపిన ప్రకారం.. మరో యువకుడిని ప్రేమిస్తున్నట్టు బాధితురాలు వేడుకొన్నారు. తనను కాంటాక్ట్ చేయవద్దని పలుమార్లు కోరారు. కానీ వెంటపడి వేధించడం ఆపలేదు. ఒకవేళ ప్రియుడిని పెళ్లి చేసుకొంటే.. ఆ తర్వాత వదిలేస్తాను అని అతను మహిళతో అనేవాడని తెలిసింది అని వెల్లడించారు.

తల్లిదండ్రులతో కలిసి కేసు

తల్లిదండ్రులతో కలిసి కేసు

బాధితురాలి ప్రియుడికి కూడా వీడియోలను చూపించాడు. దాంతో వారిద్దరి మధ్య జరిగిన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అని పోలీసులు మీడియాకు వెల్లడించారు. సినీ హీరోపై ఐపీసీ సెక్షన్ 315 ప్రకారం కేసు నమోదు చేశాం. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X