కన్నడ సినీపరిశ్రమలో డ్రగ్స్ కలకలం.. ప్రముఖ స్టార్లకు లింకులు.. రియా ఘటనతో..

బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కన్నడ పరిశ్రమలో మాదక ద్రవ్యాల గుట్టు రట్టయింది. కన్నడ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటులు, సంగీత దర్శకులకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయనే విషయం బయటకు రావడంతో శాండల్‌ఉడ్‌లో కలకలం రేపింది. అయితే ముంబై, బెంగళూరులో భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించారనే విషయం ఇప్పుడు షాకింగ్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇలా..

ముంబై తర్వాత బెంగళూరుపై ఎన్సీబీ నజర్

ముంబై తర్వాత బెంగళూరుపై ఎన్సీబీ నజర్


ముంబైలో డ్రగ్స్‌ మాఫియాతో బాలీవుడ్ హీరోలకు, రాజకీయ నేతలకు లింకులు ఉన్నాయనే విషయం రియా చక్రవర్తిని విచారిస్తుండగా విషయం బయటపడింది. దాంతో మెట్రోపాలిటన్ సిటీ బెంగుళూరుపై కూడా నార్కోటిక్ అధికారులు పంజా విసిరారు. గత రెండువారాల్లో జరిపిన సోదాల్లో భారీగా నిషేధిత డ్రగ్స్, డబ్బును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బెంగళూరు అడ్డాగా జరుగుతున్న అక్రమ దందాపై అధికారులు దృష్టిపెట్టారు.

నార్కోటిక్ దాడుల్లో దిగ్బ్రాంతికరమైన విషయాలు

నార్కోటిక్ దాడుల్లో దిగ్బ్రాంతికరమైన విషయాలు


బెంగళూరులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జరిపిన దాడుల్లో దిగ్బ్రాంతికి గురిచేసే అంశాలు బయటకు వచ్చాయి. ప్రమాదకరమైన డ్రగ్స్‌ను ఆటబొమ్మలకు సంబంధించిన పార్శిళ్లలో పెట్టి సరఫరా చేస్తున్నారనే విషయం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ నిషేధిత డ్రగ్స్ జర్మనీ, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది.

ఆన్‌లైన్‌లోనే డ్రగ్స్ వ్యాపారం

ఆన్‌లైన్‌లోనే డ్రగ్స్ వ్యాపారం


ముంబై, బెంగళూరు పట్టణాలను టార్గెట్‌గా చేసుకొని ఎండీఎంఏ డ్రగ్‌ను సరఫరా చేస్తున్నట్టు సమాచారం. డ్రగ్ మాఫియా ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం కొనసాగిస్తున్నారని, డ్రగ్‌కు బదులుగా డబ్బు కాకుండా బిట్ కాయిన్స్‌ను తీసుకొంటున్నట్టు తెలిసింది. బెంగళూరులోని విలాసవంతమైన ప్రదేశాలు కల్యాణ్ నగర్, దొడ్డగుబ్బి తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి ఎం అనూప్, ఆర్ రవీంద్రన్, అనిఖా డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Recommended Video

Kannada Superstar Upendra Kabja Movie Photoshoot Making
సినీ తారలపై దృష్టిపెట్టిన అధికారులు

సినీ తారలపై దృష్టిపెట్టిన అధికారులు


ఇటీవల బెంగళూరు నగరంలో నార్కోటిక్ అధికారులు జరిపిన వరుస దాడుల్లో సినీ హీరోలు, ఇతర ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తున్నది. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న వారు చెప్పిన సమాచారంతో సినీ ప్రముఖులపై అధికారులు నజర్ పెట్టినట్టు సమాచారం. వారికి సంబంధించిన పార్టీలు, విందులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X