అంబరీష్ మరణం నుంచి తేరుకోక ముందే కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం!
ప్రముఖ నటుడు, సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న అంబరీష్ మరణం నుంచి కన్నడ సినీ పరిశ్రమ తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ ఫిల్మ్ మేకర్ ఏఆర్ బాబు మంగళవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన మరణించిట్లు తెలుస్తోంది.
కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఏఆర్ బాబు ఏఆర్ బాబు గత ఆరేళ్లుగా... ప్రతి ఆరు నెలలకు ఒక సారి డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం కన్నుమూశారు.

56 ఏళ్ల ఏఆర్ బాబు... హలో యమా, సప్నోంకి రాణి, కూలీ రాజా, ఖలనాయకా, మరుజన్మ, యార్దు దుడ్డు యల్లమనా జాత్రె లాంటి పాపులర్ కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
మంగళవారం సాయంత్రం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏఆర్ బాబు అంత్యక్రియలు బెంగులూరులోని బాపూజీ నగర్లో జరుగనున్నాయి. ఏఆర్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











