రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువ హీరో.. పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీలో విషాదం!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సమీప బంధువు, కన్నడ పరిశ్రమలో యువ నటుడు సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు నుంచి ఊటికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి ట్రిప్పర్‌ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గాయపడిన ఆయనను బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదం ఘటన సంఘటన వివరాల్లోకి వెళితే..
సూరజ్ కుమార్ విషయానికి వస్తే.. నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ కుమారుడు. డాక్టర్ రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మకు సమీప బంధువు. త్వరలోనే భగవాన్ శ్రీకృషఫ్ణ పరమాత్మ కన్నడ పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూరజ్ కుమార్ గాయపడటం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

సూరజ్ కుమార్ బెంగళూరు నుంచి బైక్‌పై ఊటికి వెళ్తున్నారు. మైసూర్ గుండ్లుపేర్ హైవే వద్ద నుంచి బెగూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆయనను మైసూర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కాలు విరిగిపోయిందని వైద్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. సూరజ్ కుమార్ మైసూర్ నుంచి ఊటికి వెళ్తున్నాడు. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న ట్రిప్పర్ లారీని తప్పించబోగా బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ఆ సందర్భంగా కుడికాలికి బలమైన గాయం తగిలింది అని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సూరజ్ కుమార్ బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను శివరాజ్ కుమార్, ఆయన సతీమణి హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. సూరజ్ కుమార్ నటించిన భగమాన్ శ్రీ కృష్ణ పరమాత్మ రిలీజ్ కానున్నది. ప్రియా ప్రకాశ్ వారియర్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











