Kanthara కోసం ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో తెలుసా.. అతను చేసుంటే మరో లెవెల్లో ఉండేది!
కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. KGF మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం కన్నడ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఊహించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా తెలుగులో అయితే పెట్టిన పెట్టుబడిని చాలా తొందరగా వెనక్కి తెచ్చి భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తోంది.
ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ విడుదలైన వారం తరువాత తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఇక రెండు వారాలు అయినా కూడా కలెక్షన్స్ అయితే తగ్గడం లేదు. హిందీలో కూడా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు లభించింది. అలాగే కాంతార సినిమాలో అతనే హీరోగా నటించిన విషయం తెలిసిందే. చివరి పది నిమిషాల్లో కూడా రీషబ్ నటించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఈ సినిమా కథ రాసుకున్న తర్వాత దర్శకుడు రిషబ్ శెట్టి మొదట తాను హీరోగా నటించాలని అనుకోలేదట. ఎవరినైనా స్టార్ హీరోను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచించి మొదట పునీత్ రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మూడేళ్ళ క్రితమే కథ రాసుకున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ కు చెప్పాడట. అయితే అతను ఇచ్చిన సలహాకు రిషబ్ శెట్టి కూడా ఆశ్చర్య పోయాడట.
ఈ కథ చాలా బాగుంది ముఖ్యంగా దేవుడికి సంబంధించిన పునకాల నేపథ్యంలో సన్నివేశాలు చాలా ఇష్టంగా చేయాల్సి ఉంటుంది అని.. అయితే నువ్వే ఈ కథను రాసుకున్నావ్ కాబట్టి నువ్వు అయితేనే ఈ కథకు చాలా న్యాయం చేయగలవు పునీత్ రాజ్ కుమార్ సలహా ఇచ్చాడట. ఇక పునీత్ ఆ విధంగా చెప్పడంతో రిషబ్ శెట్టి మరొక హీరో వద్దకు వెళ్లకుండా తనే హీరోగా నటించాలని డిసైడ్ అయ్యాడట. ఒక విధంగా రిషబ్ ఈ కథకు చాలా న్యాయం చేశాడు. కానీ పునీత్ రాజ్ కుమార్ నటించి ఉంటే ఈ సినిమా ఆయన కెరీర్లో మరొక రేంజ్ కు వెళ్లి ఉండేది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక పునీత్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











