పోలీసుల చేతికి యువ నటి అశ్లీల ఫోటోలు, బూతు వీడియోలు.. మేకప్ మ్యాన్ అరెస్ట్‌లో భారీ ట్విస్టు!
కన్నడ సినీ పరిశ్రమలో యువ నటిపై వేధింపులకు, బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మేకప్ ఆర్టిస్టు వ్యవహారంలో ట్విస్టు అదిరిపోయింది. తీగ లాగితే డొంక కదిలిందనే విధంగా మేకప్ ఆర్టిస్ట్ విచారించే క్రమంలో యువ నటి ఫోన్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు పోలీసుల దృష్టికి వచ్చాయి. యువ నటి మొబైల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు చూసి పోలీసులు దిగ్బ్రాంతికి గురయ్యారనేది బెంగళూరు మీడియా కథనం. మేకప్ ఆర్టిస్ట్ అరెస్ట్ కేసులో బయటకు వచ్చిన యువ నటి వ్యవహారం విషయంలోకి వెళితే..

యువ నటికి మేకప్ మ్యాన్ వేధింపులు
యువ నటి మొబైల్ ఫోన్ పాస్ వర్డ్ చోరికి పాల్పడిన మేకప్ ఆర్టిస్టు.. ఆమె లేని సమయంలో ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను తన ఫోన్‌లోకి మేకప్ ఆర్టిస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసుకొన్నాడు. ఆ తర్వాత 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ.. బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. మేకప్ ఆర్టిస్ట్‌ను అరెస్ట్ చేశారు.

పోర్న్ యాప్ కోసం ఫోటోలు, వీడియోలు
అయితే మేకప్ ఆర్టిస్ట్ ఫోన్ సోదాలు జరిపిన తర్వాత ఆసక్తికరమైన అంశాలు బయటకు పొక్కాయి. మేకప్ ఆర్టిస్ట్ ఫోన్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు చూసి పోలీసులు అవాక్కయారు. అయితే మేకప్ ఆర్టిస్టును విచారించడంతోపాటు యువ నటి గురించి ఆరా తీయగా.. పోర్న్ యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు అశ్లీలంగా వీడియోలు, ఫోటోలు తీయించుకొన్నారనే విషయం బయటకు వచ్చింది.

పోర్న్ యాప్‌తో ఒప్పందం?
నెటిజన్లు, యూజర్లకు అశ్లీల ఫోటోలు, వీడియోలు ఎర వేసే యాప్‌తో యువ నటి ఒప్పందం కుదుర్చుకొన్నది. యూజర్ల నుంచి భారీ మొత్తాన్ని తీసుకొని వారికి ఫోటోలు, వీడియోలను యాప్ సప్లై చేస్తున్నది. అలాంటి యాప్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నారు అని పోలీసులకు స్పష్టమైంది.

పోర్న్ యాప్‌పై పోలీసుల విచారణ
ప్రస్తుతం మేకప్ ఆర్టిస్టుతోపాటు యువ నటి వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. యువ నటి ఒప్పందం కుదుర్చుకొన్న యాప్ గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వర్థమాన తారలు, మోడల్స్‌కు ఎరవేసే యాప్‌ల చీకటి కోణం గురించి కూపీ లాగుతున్నారు. మేకప్ ఆర్టిస్టు నిర్వాకం వల్ల ఈ రకమైన చీకటి దందా పోలీసుల దృష్టిలోకి వచ్చిన విషయం ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

కన్నడలో రాజ్ కుంద్రా తరహా బిజినెస్?
గతంలో పోర్న్ యాప్‌ల ద్వారా అశ్లీల దందా చేసే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. రాజ్ కుంద్రా పోర్న్ దందాను బట్టబయలు చేయడమే కాకుండా ఆయనను రిమాండ్‌కు తరలించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా అశ్లీల ఫోటోలు, వీడియోలు వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమలో వెలుగు చూడటం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











