న్యూడ్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తా.. హీరోయిన్‌ను బెదిరించిన యువకుడు ఎవరో తెలుసా?
నగ్నంగా ఉన్న ఫోటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై లీక్ చేస్తానని యువ నటితో బెదిరింపులకు పాల్పడిన మేకప్ ఆర్టిస్టును పోలీసులు అరెస్ట్చేశారు. ఈ ఘటన బెంగళూరులోని హెబ్బల్‌కు సమీపంలోని భువనేశ్వరినగర్‌లో చోటుచేసుకొన్నది. యువ నటి ఫిర్యాదుతో మహంతేష్ అనే మేకప్ ఆర్టిస్టును అరెస్ట్ చేశారు. ఈ కేసు వివారాల్లోకి వెళితే..

యువ నటికి వేధింపులు
కన్నడ పరిశ్రమలో సీనియర్ యాక్టర్‌గా పేరున్న ఓ నటి 2013 నుంచి 2015 వరకు బాగా రాణించింది. కోవిడ్ తర్వాత ఆఫర్లు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు తనను వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

30 లక్షలు ఇవ్వాలని డిమాండ్
నటి పోలీసులకు వెల్లడించిన ప్రకారం.. వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. నా వద్ద నీవు నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. 30 లక్షల రూపాయలు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో రిలీజ్ చేస్తానని బెదిరించాడు. డబ్బులు చెల్లించడానికి డెడ్‌లైన్ కూడా పెట్టాడు. అయితే తొలుత నేను ఆ బెదిరింపులను తేలికగా తీసుకొన్నాను. నాకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు లేవనే ధైర్యంతో ఉన్నాను. అయితే అతడు కొన్ని ఫొటోలు శాంపిల్‌గా పంపించడంతో షాక్ తిన్నాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్‌కు పంపుతానని బ్లాక్ మెయిల్ చేశాడు అని ఫిర్యాదులో తెలిపింది.

మేకప్ ఆర్టిస్టుగా గుర్తించి..
నటి ఫిర్యాదుతో ఈశాన్య సీఈఎన్ రంగంలోకి దిగిన పోలీసులు బ్లాక్‌మెయిలర్ మహంతేష్‌ను అదుపులోకి తీసుకొన్నాడు. ఆ తర్వాత అతడిని మేకప్ ఆర్టిస్టుగా గుర్తించారు. మహంతేష్‌ను విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తన నేరాన్ని అంగీకరించాడు.

ఫోన్ పాస్‌వర్డ్ చోరికి పాల్పడి..
మేకప్ ఆర్టిస్టు మహంతేష్ అరెస్ట్ తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. నటి ఫోన్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చోరికి పాల్పడ్డాడు. ఆమె షూటింగులో ఉన్నప్పుడు తన ఫోన్‌లోని ఫోటోలను, వీడియోలను తన మొబైల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు అని తెలిపారు.

ఫోన్ స్వాధీనం చేసుకొని..
ప్రస్తుతం నటిని వేధించిన కేసులో మేకప్ ఆర్టిస్టు మహంతేష్ ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. ఆ ఫోన్ నుంచి ఫోటోలను, వీడియోలను డిలీట్ చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.


Click it and Unblock the Notifications











