హిందుత్వంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మరో నటుడు.. అరెస్టు చేసిన పోలీసులు!
చేతన్ అహింసగా ప్రసిద్ధి చెందిన కన్నడ నటుడు చేతన్ కుమార్ ను కన్నడ పోలీసులు అరెస్టు చేశారు. హిందుత్వంపై అభ్యంతర ట్వీట్లు చేసినందుకు గాను చేతన్ అహింసను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'హిందుత్వం అబద్ధాలపై నిర్మించిబడింది' అంటూ చేతన్ అహింస ట్వీట్ చేశాడు. దీనిపై హిందువుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు చేతన్ అహింసను అదుపులోకి తీసుకున్నారు. దళిత, గిరిజన ఉద్యమకారుడిగా చెప్పుకునే చేతన్ అహింసను కోర్టులో హాజరు పరచనున్నారు. చేతన్ అహింస మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టాడని పోలీసులు అతడి పై అభియోగాలు మోపారు. మార్చి 20వ తేదీన చేతన్ అహింస హిందుత్వకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశాడు.

రాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పటి నుండే భారత దేశంగా పిలువబడుతోందన్నది అబద్ధమని చేతన్ అహింస ట్వీట్ చేశారు. బాబ్రీ మసీదు రామ జన్మస్థలం అన్నది అబద్ధమని, టిప్పును హతమార్చింది ఊరిగౌడ, నంజేగౌడ అన్నది కూడా అబద్ధమని పేర్కొంటూ చేతన్ అహింస ట్వీట్లు చేశాడు. హిందుత్వాన్ని నిజంతోనే ఓడించగలమని చేతన్ పేర్కొన్నాడు.
చేతన్ అహింస హిందుత్వకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన గంటల వ్యవధిలోనే హిందూ అనుకూల సంస్థలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చేతన్ పై శేషాద్రిపురం స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చేతన్ కు ఇదే మొదటిసారి కాదు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై కూడా చేతన్ అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేసినందుకు అతడిని అరెస్టు చేశారు.

కాంతార మూవీపైనా చేతన్ గతంలో విమర్శలు చేశాడు. భూతకోల హిందువుల సాంప్రదాయం కాదని చేతన్ అహింస అన్నాడు. కాంతారలో చూపించిన భూతకోల ఆదివాసీల సాంప్రదాయమని, దానికి హిందుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యలు చేయగా, అవి కాస్త వివాదాస్పదంగా మారాయి.


Click it and Unblock the Notifications











