Thug Life: కమల్ హాసన్‌పై కన్నడవాసులు కన్నెర్ర.. థగ్ లైప్‌ను నిషేధిస్తాం

విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్‌ మరో వివాదంలో చిక్కుకొన్నారు. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో ఫంక్షన్‌లో ఆయన చేసిన కామెంట్లపై కన్నడ వాసులు కన్నెర్ర చేశారు. కమల్ హద్దు మీరి వ్యాఖ్యలు చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు. బేషరుతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. లేకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం వెనుక కారణం ఏమిటి? కన్నడిగులపై చేసిన కామెంట్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిషా, అభిరామి, శింబు నటించిన థగ్ లైఫ్ సినిమా థగ్ లైఫ్ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ ముందే కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అని అన్నారు. దాంతో కన్నడ వాసుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదంపై కన్నడ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

Kamal Haasan faces Kannada Protests

కన్నడలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తాం. ఆయన కన్నడ వాసులకు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాలి.లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమాను అడ్డుకొంటాం. మా మాతృభాషను అలా అవమానిస్తే సహించం అని పలు సంస్థలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కన్నడ భాషను, కన్నడ ప్రజలను అవమానించారు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు.

కర్ణాటక రక్షణ వేదిక (ప్రవీణ శెట్టి వర్గం) అధ్యక్షుడు థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. దాంతో కమల్ హాసన్‌ను కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు అని డెక్కన్ హెరాల్డ్ వెబ్ సైట్ తన కథనంలో వెల్లడించింది. అనంతరం ఈ గ్రూపుకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతూ.. ఈ సినిమాను ప్రదర్శించాలంటే.. అలాగే బిజినెస్ చేయాలనుకొంటే.. కన్నడిగులను అవమానించవద్దు అని అన్నారు.

నేను కన్నడ వాసులను అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను ఏదైతే మాట్లాడానో.. అది ప్రేమతో కూడిన మాటలే. చరిత్రలో భాష గురించి చరిత్రకారులు చెప్పిన విషయాలను మాత్రమే అన్నాను. అందులో నాకు దురుద్దేశం లేదు. తమిళనాడు రేర్ స్టేట్. మీనన్ పేరుతో ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి, రెడ్డి కులస్తుడు మంత్రిగా, కన్నడ వాసులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కన్నడ నుంచి జయలలిత చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది నా సమాధానం కాదు. ఇది వివరణ మాత్రమే. ప్రేమను కోరుకొనే వారు క్షమాపణలు అడగరు అని కమల్ హాసన్ అన్నారు.

More from Filmibeat

Read more about: thug life kamal haasan kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X