హరిహర వీరమల్లు పోస్టర్లు చింపేసిన కన్నడ వాసులు.. పవన్ కల్యాణ్ మూవీకి నిరసన సెగ

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరి హర వీరమల్లు. 5 ఏళ్లుగా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఎట్టకేళలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతటా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండగా జరుగుతున్నాయి. ఇక మూడు రోజుల పాటు ఈ చిత్రం ప్రమోషన్స్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నా కూడా సమయం కేటాయించారు పవన్ కళ్యాణ్. తనకు వీలైనంతగా హరి హర వీరమల్లు చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

తొలుత ఒంగోలులో ఫ్లెక్సీల తొలగింపు..
హరి హర వీరమల్లు చిత్రం తెలుగు తోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఏపీలోని ఒంగోలులో హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ఫ్లేక్సీలను స్థానిక టీడీపీ నేతలు తొలగించడం ఇటీవల హాట్ టాపిక్ గ్గా మారింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కారణంగా తొలగించారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం హరి హర వీరమల్లు చిత్ర ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో తన ఫొటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఆయన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లేక్సీలను తొలగించారు. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ హరి హర వీరమల్లు చిత్ర ఫ్లేక్సీలను తొలగిస్తుండటం హాట్ టాపిక్ గ్గా మారింది.

Kannada People against to Pawan kalyan Latest Film Hari Hara Veeramallu

తాజాగా కర్ణాటకలో..
హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ సందర్భంగా కన్నడలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లేక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పోస్టర్లపై తెలుగు భాష ఉండటంపై అభ్యంతరం తెలిపారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపి వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఏర్పాటు చేసిన హరి హర వీరమల్లు చిత్రం ఫ్లేక్సీలను తొలగించడం నేపథ్యంలో వెంటనే పోలీసులు జ్యోక్యం చేసుకొని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. హిందీ భాష గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి.. కన్నడ భాషలో పోస్టర్లతో కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది.

హరి హర వీరమల్లు బడ్జెట్..
పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో నటించిన చిత్రం హరి హర వీరమల్లు. ఏఎం రత్నం రూ.250 కోట్లతో నిర్మించారు. తొలుత క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. హరి హర వీరమల్లు పార్ట్ : 1 చిత్రీకరణను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జూలై 23న ఏపీ తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ ఉండగా, జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X