అమ్మ క్షమించు.. నా జీవితాన్ని ముగిస్తున్నా.. సింగర్ సుస్మిత సూసైడ్ వెనుక సంచలన విషయాలు..
సింగర్ సుస్మిత హెచ్ఎస్ సూసైడ్ వార్తతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. వరకట్న వేధింపుల కారణంగా సుస్మిత బెంగళూరులోని నగర్‌భావిలోని తన తల్లిదండ్రుల ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించిన వార్త స్థానికంగా సంచలనం రేపింది. తాజాగా ఆమె పంపిన వాట్సప్ మెసేజ్ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా.. ప్రతీ ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. మరణానికి ముందు వాట్సప్ మెసేజ్‌లో సుస్మిత ఏం రాశారంటే..

ఆదివారం రాత్రి గొడవ తర్వాత
వార్త కథనాల ప్రకారం.. సుస్మితకు శరత్ కుమార్ అనే వ్యక్తితో 2018లో వివాహం జరిగింది. అప్పటి నుంచి బెంగళూరులోని కుమారస్వామి లే అవుట్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి తన పుట్టింటికి చేరుకొని తన భర్తతో గొడవపడ్డానని చెప్పింది. ఆదివారం రాత్రి తన సోదరుడు సచిన్‌తో డిన్నర్ చేస్తూ సాధారణంగానే మాట్లాడింది అని తెలిసింది.

అదనపు కట్నం తేవాలని
ఆదివారం రాత్రి తన సోదరుడికి వాట్సప్ మెసేజ్ పంపింది. అందులో నా వైవాహిక జీవితం కష్టాల్లో పడింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటి వారి నుంచి వేధింపులు ఎక్కువై పోతున్నాయి. నేను భరించలేకపోతున్నాను. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను. అమ్మా, అన్నయ్య ఈ విషయంలో నన్ను క్షమించు అంటూ రాత్రి ఒంటిగంట తర్వాత వాట్సప్‌లో మెసేజ్‌ను తన సోదరుడికి పంపించింది.

తప్పులకు భారీ మూల్యం
నేను చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకొంటున్నాను. ఇప్పటికే భరించలేనంత టార్చర్‌ను అనుభవించాను. నన్ను తీవ్రంగా వేధించిన వారిని వదులొద్దు. నేను వాళ్లింటిలో చనిపోవడం ఇష్టం లేకపోవడం వల్లే ఇక్కడి వచ్చాను. పెళ్లి జరిగిన మొదటి రోజు నుంచే నాకు టార్చర్ పెట్టారు. అది ఎవరికీ చెప్పుకోలేకపోయాను అంటూ వాట్సప్ మెసేజ్‌లో సుస్మిత పేర్కొన్నది.

ఉదయాన్నే మెసేజ్ చూసుకొని
సుస్మిత రాత్రి పంపిన వాట్సప్ మేసేజ్‌ను వెంటనే చూసుకోకపోవడంతో దారుణం జరిగిపోయింది. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో నేను మెసేజ్ చూసుకొన్నాను. వెంటనే ఆమె గది వద్దకు పరుగెత్తి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది అంటూ సుస్మిత సోదరుడు సచిన్ కన్నీటి పర్యంతమయ్యారు.
Recommended Video


నా వల్లే నా కూతురు జీవితం
సుస్మిత మరణంతో తల్లీ మీనాక్షి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. నా బలవంతంగానే పెళ్లి జరిగింది. నా కూతురు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ.20 లక్షల లోన్ తీసుకొన్నాం. సుమారు 150 గ్రాముల బంగారం కొన్నాం. అన్ని రకాలుగా ఇచ్చినా నా కూతురును నానా రకాలుగా హింసించారు. నా కూతురు జీవితం అర్ధాంతరంగా ముగియడానికి నేనే కారణం అంటూ మీనాక్షి కన్నీటి పర్యంతమయ్యారు.


Click it and Unblock the Notifications











