సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన స్టార్ నటుడు..

కన్నడ ఇండస్ట్రీలో గుండెపోటుతో చనిపోయే వారి జాబితా పెరుగుతూ ఉంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. తరువాత లక్ష్మణ్, మనదీప్ రాయ్, బులెట్ ప్రకాశ్ లాంటి యాక్టర్స్ గుండెపోటుతో చనిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా నితిన్ గోపి అనే మరో యాక్టర్ గుండెపోతుతో మృతి చెందారు. జూన్ 2న అతనికి అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అతను మృతి చెందాడు. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. ఆయన వయస్సు కేవలం 39 ఏళ్ళు మాత్రమే.

Kannada star actor Nithin Gopi dies due to heart attack

ఇదిలా ఉంటే నితిన్ గోపి నటుడిగా హలో డాడీ, కేరళిద కేసరి, ముత్తినంత హెందాటి, నిశ్శబ్దం, చిరబాంధవ్య వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించాడు. అలాగే పునర్వివాహ అనే సీరియల్ లో లీడ్ రోల్ చేశాడు. అలాగే మరికొన్ని సీరియస్ లో కూడా అతను కీలక పాత్రలు చేశాడు. దాంతో పాటు హరహర మహాదేవ సీరియస్ లో గెస్ట్ పాత్రలో కనిపించాడు.

ప్రస్తుతం కొత్త సీరియల్ కి దర్శకత్వం వహించే ప్లాన్ లో ఉన్నారు. దానికి సంబంధించి ఒక టీవీ ఛానల్ తో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఊహించని విధంగా గుండెపోటు రావడం మరణించడం కన్నడ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయన మరణంపై పలువురు ఆర్టిస్ట్స్ తమ సంతాపం తెలియజేశారు.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. చిన్న వయస్సులో కూడా చాలా మంది గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోవడం జరుగుతోంది. ఈ గుండెపోటు మరణాలకి కారణం పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది నటులు ఇలా గుండెపోటుతో చనిపోతూ ఉండటం కాస్తా కలవరపెట్టే అంశంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X