సుదీప్ తరహాలో తెలుగు సినిమాలపై కన్నేసిన మరో కన్నడ స్టార్

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీ నటీనటులు కూడా బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. బాషాభేదం లేకుండా ఆడియెన్స్ కూడా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను భాగానే లైక్ చేస్తున్నారు. దానికి తోడు పాన్ ఇండియా సినిమాలు కూడా పరభాషా నటీనటులకు మంచి క్రేజ్ అందిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. త్వరలో మరో కన్నడ స్టార్ నటుడు తెలుగులో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఉపేంద్ర తెలుగులో రెగ్యులర్ హీరో మాదిరిగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సుదీప్ రక్త చరిత్ర, ఈగ సినిమాలతో అంతకంటే హై రేంజ్ లో క్లిక్కయ్యాడు. అవసరం ఉన్న ప్రతిసారి అతని తెలుగు సినిమాలకు బాగానే ఉపయోగపడుతున్నాడు. ఇక త్వరలో శివరాజ్ కుమార్ కూడా అదే తరహాలో బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Kannada star actor shiva rajkumar special focus on tollywood

కన్నడలో స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న శివరాజ్ కుమార్ క్లిలింగ్ వీరప్పన్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి బాగానే దగ్గరయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శివరాజ్ కుమార్ నటించిన విధానం తెలుగు ఆడియేన్స్ కి బాగానే నచ్చింది. ఇక నెక్స్ట్ టాలీవుడ్ ల్ తెరకెక్కనున్న ఒక ద్విభాషా సినిమాలో నెగిటివ్ పాత్రలతో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ అయ్యాయట. ఇక తెలుగులోలోనే మరో రెండు డైరెక్ట్ సినిమాలలో గెస్ట్ రోల్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. చూస్తుంటే సుదీప్ తరహాలోనే ఈ హీరో ఒక మంచి నటుడిగా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అతని ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X