ఆడబిడ్డకు తండ్రైన సినీ హీరో.. ట్విట్టర్‌లో వెల్లడి
కన్నడ యువ హీరో అజయ్ రావు వ్యక్తిగత జీవితంలో ప్రమోషన్ లభించింది. అజయ్ రావు దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మిచింది. తన కుటుంబంలోకి మరో వ్యక్తి ప్రవేశించారంటూ ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాంతో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు అజయ్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే..

పండంటి బిడ్డను
అజయ్ రావు నటించిన థయిగే థక్క మాగా అనే చిత్రం గతవారం రిలీజై సక్సెస్‌ను అందుకొన్నది. అంతలోనే పండంటి బిడ్డను భార్య స్వప్న కానుకగా అందించింది. భార్య, పసిపాప ఆరోగ్యంగా ఉన్నట్టు సన్నిహితులతో శుభవార్తను పంచుకొన్నారు. దాంతో అజయ్‌కి డబుల్ ధమాకాగా మారింది.

గర్ల్‌ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి
అజయ్ రావు వ్యక్తిగత జీవితానికి వస్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత అజయ్ రావు తన గర్ల్‌ఫ్రెండ్‌తో అఫైర్ కొనసాగించాడు. చాలా కాలం ప్రేమలో మునిగి తేలారు. ఆ తర్వాత పెద్దలు తమ ప్రేమకు అంగీకారం తెలియజేయడంతో 2014లో హోస్పేట్‌లో ఓ ఆలయంలో పెళ్లి చేసుకొన్నాడు.

2003లో కన్నడ పరిశ్రమలోకి
ఇక అజయ్ రావు ప్రొఫెషనల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. 2003లో ఎక్స్యూజ్ మీ అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. దాదాపు 25 చిత్రాల్లో నటించాడు. తాజ్ మహల్, కృష్ణన్ లవ్ స్టోరి, కృష్ణన్ మ్యారేజ్ స్టోరి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.

నిర్మాతగా అజయ్
తాజాగా థయిగే థక్క మగా చిత్రంతో అజయ్ రావు నిర్మాతగా మారాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రానికి శశాంక్ దర్శకుడిగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











