Capture Movie: మొహమంతా రక్తం.. భయంకరంగా నవ్వుతున్న కన్నడ స్టార్ హీరో భార్య, ఏం జరిగిందంటే?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సినిమాలతో పాటు అనేక డబ్బింగ్ చిత్రాల్లో నటించిన ఈయన గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. హీరో భార్యగానే కాకుండా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ క్యూట్ బ్యూటీ. కేవలం కన్నడ ఇండస్ట్రీ పైనే కాకుండా ఆమె తాజాగా టాలీవుడ్ పై కన్నేశారు. ఈక్రమంలోనే తన 50వ సినిమా డిటెక్టివ్ తీక్షను సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు.

అలాగే మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నారు. అయితే ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో క్యాప్చర్ అనే సినిమా రాబోతుంది. హీరోయిన్ రాధికా కుమార స్వామి సమర్పణలో.. షమికా ఎంటర్ ప్రైజెస్, శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్ సంస్థలపై రవిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే లోహిత్ హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించడంలో ఆయనకు మంచి గుర్తింపే ఉంది. అలాంటి డైరెక్టర్ తో ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో రాబోతున్న క్యాప్చర్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

Kannada Star Hero Upendra Wife Priyanka Capture Movie First Look Outnow.

అయితే ఈరోజు ప్రియాంక ఉపేంద్ర పుట్టిన రోజు. ఈక్రమంలోనే క్యాప్చర్ సినిమాకు సంబంధించిన పస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే పోస్టర్ లో ప్రియాంక ఉపేంద్ర లుక్ చూస్తేనే విపరీతంగా భయం వేస్తోంది. ఆమె మొహం నిండా రక్తం ఉండగా.. చుట్టూ కెమెరాలు ఉన్నాయి. అలగా కెమెరాలపై ఓ కాకి కూడా ఉంది. రక్తంతో నిండిన మొహంతోనే ప్రియాంక భయంకరంగా నవ్వడం చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. పోస్టర్ యే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి మరి.

క్యాప్చర్ సినిమా మొత్తాన్ని సింగిల్ లెన్స్ ఫార్మాట్ లో షూట్ చేశారని టాక్ నడుస్తోంది. సిల్వర్ స్క్రీన్ మమీద సీసీ టీవీ ఫుటేజీ ప్రజెంట్ చేసినట్లు ఉంటుందని చిత్రబృందం చెబుతుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. త్వరలోనే క్యాప్చర్ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

కేవలం 30 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారట. ప్రియాంక ఉపేంద్రతో పాటు శివరాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్ రాజ్ బాల నటుడిగా పరిచయం అవుతున్నారు. చూడాలి మరి ఫస్ట్ లుక్ తోనే ఇంతగా భయపెడుతున్న ఈ క్యాప్చర్ సినిమా.. విడుదలయ్యాక ఏ రేంజ్ లో భయపెడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X