డ్రగ్స్ కేసు‌లో హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ అరెస్ట్.. మరో హీరోయిన్‌‌ మెడకు ఉచ్చు

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియాతో సినీ తారలు, ప్రముఖుల సంబంధాలు బయట పడుతుండటం సంచలనంగా మారింది. దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ తర్వాత ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేదికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేయడం, అలాగే హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ కేసుపై రాగిణి తన సోషల్ మీడియాలో స్పందించారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి మరిన్ని వివరాలు...

 డైరెక్టర్ ఇంద్రజిత్‌ను ప్రశ్నించడంతో

డైరెక్టర్ ఇంద్రజిత్‌ను ప్రశ్నించడంతో

గత మూడు రోజులుగా కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధాలపై ప్రముఖులను ఎన్సీబీ ప్రశ్నిస్తున్నది. దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌ను బుధవారం విచారించారు. ఆయన నుంచి సినీ తారలకు ఉన్న సంబంధాల వివరాలను సేకరించారు. విచారణ సందర్భంగా లంకేష్ ఓ జాబితాను అధికారులకు సమర్పించినట్టు సమాచారం. ఆ తర్వాతనే రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేసినట్టు సమాచారం. గురువారం కూడా విచారణ కోసం లంకేష్‌కు సమన్లు జారీ చేసినట్టు తెలిసింది.

రాగిణి ద్వివేదితోపాటు స్నేహితుడికి కూడా

రాగిణి ద్వివేదితోపాటు స్నేహితుడికి కూడా

డ్రగ్స్ సప్లయిదారులతో రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. రాగిణితోపాటు ఆమె స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగికి కూడా సమన్లు అందించినట్టు తెలుస్తున్నది. గురువారం ఛామ్‌రాజ్‌పేట్‌లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో రాగిణి

సోషల్ మీడియాలో రాగిణి

బెంగళూరు పోలీసులు జారీ చేసిన సమన్లపై నటి రాగిణి ద్వివేది సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులు నాకు అందాయి. కొన్ని కారణాల వల్ల సీసీడీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. చట్టాలపై నాకు గౌరవం ఉంది. సోమవారం వరకు నా తరఫున లాయర్లు విచారణకు హాజరవుతారు. ఈ కేసులో నేను సోమవారం పోలీసుల ముందు హాజరవుతాను అని రాగిణి స్పష్టం చేశారు.

 నాకు సంబంధాలు లేవు...

నాకు సంబంధాలు లేవు...

బెంగళూరు పోలీసులు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. దేశ పౌరురాలిగా నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ డ్రగ్స్ వ్యవహారంలో దాచాల్సిన అవసరం ఏమీ లేదు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించే వారితో నాకు సంబంధాలు లేవు. నాకు నోటీసులు రావడంపై ఆందోళన పడుతున్న అభిమానులకు రుణపడి ఉంటాను అని రాగిణి ద్వివేది చెప్పారు.

 సంజనా గల్రానీ సహాయకుడి అరెస్ట్

సంజనా గల్రానీ సహాయకుడి అరెస్ట్

ఇదిలా ఉండగా, ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ సహాయకుడు రాహుల్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం మరింత కలకలం రేపింది. ఈ క్రమంలో సంజనాపై కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కూడా దృష్టిపెటింది. అయితే తనకు సంబంధాలున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Recommended Video

TV Serial Actress Ragini About Her Husband || Filmibeat Telugu
 డ్రగ్స్ మాఫియాతో సంబంధాలుంటే కఠిన చర్యలు

డ్రగ్స్ మాఫియాతో సంబంధాలుంటే కఠిన చర్యలు

కన్నడ సినీ పరిశ్రమకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కే జయరాజ్ స్పందించారు. ఈ కేసుతో ఏ హీరో, హీరోయిన్‌కు సంబంధాలు ఉన్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. ఎవరికో కొందరికి సంబంధాలు ఉంటే సినీ పరిశ్రమకు ఇలాంటి ఆరోపణలు అంటగట్టడం భావ్యం కాదు అని జయరాజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X