twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు వంద శాతం కావాల్సిందే.. యశ్ కామెంట్స్ వైరల్

    |

    ప్రస్తుతం దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ దూసుకుపోతోన్న తరుణంలో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టే దిశగా ఆలోచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు పరచాలిన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలో థియేటర్లు, సినిమా రంగంపై జులుం విధించారు. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీపై కొరడా ఝులిపించారు.

    యువరత్న సినిమా ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మరో వైపు కర్ణాటక రాష్ట్రంలో కరోనా తాండవం చేస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం థియేటర్‌లో 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతిని ఇచ్చింది. దీనిపై శాండిల్ వుడ్ ఫైర్ అయింది. ఇది సినిమా రంగంపై హత్యాయత్నం వంటిది అని రాకింగ్ స్టార్ యశ్ పేర్కొన్నాడు. వంద శాతం ఆక్యుపెన్సీ కావాల్సిందేనని యశ్ డిమాండ్ చేశాడు.

    Kannada star Yash About 100 Percent Occupancy

    ఈ మేరకు యశ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. యువరత్న సినిమాకు, పునీత్ రాజ్‌కుమార్‌కు మద్దతుగా యశ్ నిలుస్తూ.. మనకు ఎన్నో సున్నితమైన బాధ్యతలున్నాయి.. అయితే ఆకలి కంటే ఘోరమైన రోగం మరొకటి ఉండదు. నిబంధనలు అనేవి బతికించేలా ఉండాలి.. కానీ బాధపెట్టేలా కాదు. ఇలా సినిమా రంగంపై సడెన్‌గా అటాక్ చేయడం అంటే.. చంపేయడం వంటిది. అందరూ పని చేసుకుంటున్నారు.. సినిమా వాళ్లం మాత్రం పని చేసుకోకూడదా? అని యశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

    English summary
    Kannada star Yash About 100 Percent Occupancy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X