కన్నడ సూపర్ స్టార్ ఇంట్లో విషాదం.. కరోనా కాటుకు కుటుంబంలో కీలక వ్యక్తి మృతి
కన్నడ సూపర్‌స్టార్ రవి చంద్రన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. నటుడు రవిచంద్రన్ కుమారుడు హంసవర్ధన్ సతీమణి శాంతి హంసవర్ధన్ ఆకస్మికంగా మరణించడంతో కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. కోడలిని కోల్పోయిన రవిచంద్రన్‌కు పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. సోషల్ మీడియా, ఫోన్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
శాంతి హంసవర్ధన్ విషయానికి వస్తే... గత నెల కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమెకు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించగా నెగిటివ్ అని తేలింది. అయితే కొద్ది రోజులకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆమె మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

హంసవర్ధన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. శాంతి హంసవర్ధన్‌కు పలువురు శ్రద్దాంజలి ఘటించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. బెంగళూరులోని బీసెంట్ నగర్ ఎలక్ట్రికల్ సెమెట్రీలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications











